iDreamPost

Revanth Reddy: CM రేవంత్ రెడ్డి మనసు దోచిన సలార్ సాంగ్.. ఆసక్తికర ట్వీట్ చేసిన ముఖ్యమంత్రి

  • Published Dec 29, 2023 | 4:01 PMUpdated Dec 29, 2023 | 4:01 PM

ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ప్రశంసిస్తుండగా.. తాజాగా రేవంత్ రెడ్డి సలార్ సినిమాపై చేసిన ట్వీట్ వైరలవుతోంది. ఆ వివరాలు..

ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ప్రశంసిస్తుండగా.. తాజాగా రేవంత్ రెడ్డి సలార్ సినిమాపై చేసిన ట్వీట్ వైరలవుతోంది. ఆ వివరాలు..

  • Published Dec 29, 2023 | 4:01 PMUpdated Dec 29, 2023 | 4:01 PM
Revanth Reddy: CM రేవంత్ రెడ్డి మనసు దోచిన సలార్ సాంగ్.. ఆసక్తికర ట్వీట్ చేసిన ముఖ్యమంత్రి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డలు క్రియేట్ చేస్తోంది. బిగ్ స్క్రీన్ మీద రెబలోడి ఊచకోత చూసి ఫ్యాన్స్ పూనకంతో ఊగిపోతున్నారు. ఆరేళ్లు ఆకలి మీద ఉన్న ప్రభాస్ అభిమానులకు సలార్ సినిమా ఫుల్ మీల్స్ లా నచ్చింది అని చెప్పవచ్చు. ప్రభాస్ సలార్ సినిమాను తొక్కడానికి బాలీవుడ్ మీడియా విపరీతంగా ప్రయత్నం చేసింది. కానీ అవేవి ప్రభాస్ క్రేజ్ ముందు నిలవలేకపోయాయి.

సలార్ సినిమాతో పాటు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్.. డంకీ సినిమా కూడా విడుదలయ్యింది. కానీ సలార్ ముందు.. డంకీ సినిమా డుంకీ కొట్టింది. ఓవర్సీస్ లో కూడా సలార్ ఊచకోత కొస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైతం సలార్ సినిమా బాగా నచ్చినట్లుంది. ఆయన చేసిన ట్వీట్ చూస్తే ఇది అర్థం అవుతోంది. ఇంతకు రేవంత్ ఏం ట్వీట్ చేశారంటే..

revanth tweet about salar movie

సలార్ సినిమాలో డార్లింగ్ ప్రభాస్, పృథ్వీరాజ్ మధ్య ఉన్న స్నేహాన్ని తెలియజెప్పేలా సాగిన “సూరీడే గొడుగు పట్టి” అనే పాట.. సినిమా కంటే ముందుగానే విడుదలై విశేష ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే. ఈ పాటలోని లిరిక్స్ ప్రతి ఒక్కరి మనసును హత్తుకున్నాయి. అయితే ఈ పాట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సైతం ఆకట్టుకుంది. తాజాగా ఇదే పాటని ఆయన ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. నాగ్‌పూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డికి అక్కడ అపూర్వ స్వాగతం లభించింది.

ఆ సభకు వెళ్లిన సమయంలో రేవంత్ రెడ్డి తనకు దక్కిన గౌరవాన్ని, రాహుల్ గాంధీతో ఉన్న అనుబంధాన్ని తెలియపరిచేలా ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కాగా.. ఆ వీడియోకు బ్యాగ్రౌండ్‌లో సలార్ సాంగ్‌‌ బీజీఎం పెట్టడం విశేషం. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇక వీడియోతో పాటు.. సూరీడే పాటలోని కొన్ని లిరిక్స్‌ కూడా తన ట్విట్టర్ పోస్ట్ లో రాసుకొచ్చారు రేవంత్ రెడ్డి. స్నేహ బంధానికి ప్రతీకగా నిలిచే లిరిక్స్ ని షేర్ చేశారు రేవంత్ రెడ్డి.

“వేగమొకడు.. త్యాగమొకడు గతము మరువని గమనమే, ఒకరినొకరు నమ్మి నడిచిన బంధమే ఇదిలే, ఒకరు గర్జన.. ఒకరు ఉప్పెన వెరసి ప్రళయాలే, సైగ ఒకరు.. సైన్యం ఒకరు కలిసి కదిలితే కదనమే..” అన్న లిరిక్స్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుండగా.. ప్రభాస్ అభిమానులు రేవంత్ ట్వీట్ పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి