iDreamPost

హిట్ అండ్ రన్ కేసుల్లో కొత్త రూల్స్.. ట్రక్, బస్ డ్రైవర్ల నిరసన ఎందుకు..?

పేపర్ తీస్తే చాలు.. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఒక్క న్యూసైనా ఉంటుంది. అలాగే హిట్ అండ్ రన్ కేసు కింద కేసు నమోదు చేశారంటూ వినిపిస్తూ ఉంటుంది. మరీ ఏంటీ ఆ కేసు. తాజాగా ట్రక్కు, బస్సు, కంటెనర్ లారీలు, ప్రైవేట్ వాహనాల డ్రైవర్లు నిరసన చేపట్టారు..? ఈ కేసుకు, వీరికి ఏంటీ సంబంధం.. పూర్తి వివరాలు..

పేపర్ తీస్తే చాలు.. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఒక్క న్యూసైనా ఉంటుంది. అలాగే హిట్ అండ్ రన్ కేసు కింద కేసు నమోదు చేశారంటూ వినిపిస్తూ ఉంటుంది. మరీ ఏంటీ ఆ కేసు. తాజాగా ట్రక్కు, బస్సు, కంటెనర్ లారీలు, ప్రైవేట్ వాహనాల డ్రైవర్లు నిరసన చేపట్టారు..? ఈ కేసుకు, వీరికి ఏంటీ సంబంధం.. పూర్తి వివరాలు..

హిట్ అండ్ రన్ కేసుల్లో కొత్త రూల్స్..  ట్రక్, బస్ డ్రైవర్ల నిరసన ఎందుకు..?

దేశంలో ప్రతి రోజూ.. ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల  యాక్సిడెంట్లు జరిగి రోడ్డు రక్తమోతున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం, నిద్రలేమితో డ్రైవింగ్ చేయడం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, అతివేగం, రాంగ్ రూట్లలో వెహికల్స్ నడపడం ఈ యాక్సిడెంట్లకు కారణాలు అవుతున్నాయి. ఈ ప్రమాదాలు ఒకరిద్దరినే కాదూ కుటుంబాన్నే బలితీసుకుంటున్నాయి. అనేక మంది జీవితాలు రోడ్డున పడుతున్నాయి. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే చాలా మంది వాహనాలు అక్కడ వదిలేసి పారిపోతుంటారు. దీన్నే హిట్ అండ్ రన్ కేసుగా పరిగణిస్తారు పోలీసులు.

అయితే ఈ కేసుల్లో నిందితుల డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేయడంతో పాటు.. ఆ డ్రైవర్ దొరికి.. నిజ నిర్ధారణ అయితే జైలు శిక్ష ఉండేది. హిట్ అండ్ రన్ కేసులో బ్రిటీష్ కాలం నాటి అమలు అవుతున్న ఈ చట్టాన్ని రద్దు చేస్తూ.. ఆ స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని చేసింది. అదే భారతీయ న్యాయ సంహిత చట్టం. ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేసింది. ఇందులో డ్రైవర్లు యాక్సిడెంట్ చేసి పారిపోకూడదు. ప్రమాదం గురించి సమాచారం పోలీసులకు రిపోర్ట్ చేయాల్సిందే. ఇక ప్రమాదం గురించి నిజ నిర్దారణ అయితే రూ. 7 లక్షల జరిమానాతో పాటు 10 సంవత్సరాల జైలు శిక్ష పడనుంది. ఇదే ట్రక్కు, లారీలు, భారీ వాహనాలు, ప్రైవేట్ బస్సు డ్రైవర్లకు శాపంగా మారింది.

Why are the truck and bus drivers protesting

ఈ నయా చట్టంపై మండిపడుతున్నారు డ్రైవర్లు. కొత్త చట్టంలోని కఠినమైన నిబంధనలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. నిరసనకు దిగారు. రాస్తారోకోలు, సమ్మెను నిర్వహించారు. ఎక్కడిక్కడ ట్రక్కులు నిలివేసి ఆందోళనలు చేపట్టారు. మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో వాహనాలు రోడ్లపై నిలిపి వేసి నిరసన చేపట్టారు. రోడ్లను దిగ్బంధించారు. దీంతో భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. సుమారు 1.20 లక్షల ట్రక్కులు, లారీలు, భారీ వాహనాలు, కంటెనర్ వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. చత్తీస్ గఢ్ లో 12 వేల ప్రైవేట్ బస్సులు నిలిపివేశారు. కాగా, కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగా అల్లర్లు చోటుచేసుకున్నాయి.

థానేలో ట్రక్కు డ్రైవర్ల నిరసనలు చేపడుతున్న సమయంలో పోలీసులు ఎంటర్ కావడంతో.. వారిపై రాళ్లు రువ్వారు ఆందోళనకారులు. హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి కొత్త చట్టంలోని నిబంధనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఒక్కసారిగా ట్రక్కులు, భారీ లారీలు రోడ్లపై నిలిచిపోవడంతో భయాందోళనకు గురయ్యారు వాహనదారులు. ఈ సమ్మె వల్ల రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ సరఫరాకు ఆటంకం కలవగచ్చునని భయపడి పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టారు. దేశంలో అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇక ఈ సమ్మె ప్రభావం కూరగాయల మీద కూడా పడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. మరీ ఈ చట్టానికి వ్యతిరేకంగా వీరు చేపడుతోన్న నిరసనలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి