iDreamPost

త్రివిక్రమ్ సెంటిమెంట్… గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే?

Guntur Kaaram Pre Release: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గుంటూరు కారం మూవీకి సంబంధించి ఓ టాక్ వినిపిస్తోంది.

Guntur Kaaram Pre Release: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గుంటూరు కారం మూవీకి సంబంధించి ఓ టాక్ వినిపిస్తోంది.

త్రివిక్రమ్ సెంటిమెంట్… గుంటూరు కారం  ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే?

సినిమాల్లో సెంటిమెంట్స్ ఎక్కువ అనే విషయం అందరికి తెలిసిందే. అందుకే మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే నాటి నుంచి..విడుదలయ్యే వరకు మేకర్స్ సెంటిమెంట్స్ ను ఫాలో అవుతుంటారు. శుక్రవారం సినిమాలను రిలీజ్ చేయడం అనేది కూడా సెంటిమెంట్ లో ఓ భాగమే.  ఇది ఇలా ఉంటే.. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న గుంటూరు కారం సినిమా విషయంలో కూడా ఓ సెంటిమెంట్ ను ఫాలో కానున్నారని టాక్ వినిపిస్తోంది. సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? అనే విషయాలపై  సినీ ప్రియుల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే “గుంటూరు కారం” ప్రీ రిలీజ్ ఈవెంట్ ను డైరెక్టర్ త్రివిక్రమ్..తన సెంటిమెంట్ ప్లేస్ లో  జరపనున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి.. వివరాల్లోకి వెళితే…

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం గుంటూరు కారం.  ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నారు. ఈ మాస్ మసాలా ఎంట్టైనర్ మూవీ షూటిగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీకి సంబంధించిన చివరి పాటను షూట్ చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో గుంటూరు కారం మూవీ పాటలతో సహా షూటింగ్ పూర్తి కాబోతోంది. ఈ సినిమా సంక్రాంతికి  థియేటర్లలోకి రానున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక సంక్రాంతికి  మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో తక్కువ సమయంలోనే మూవీ ప్రమోషన్స్ కూడా స్టార్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

guntur karam pre release event

ఇక గుంటూరు కారం షూటింగ్ పూర్తి అయిన తరువాత మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ వెకేషన్ కి వెళ్తారని సమాచారం. వారం పాటు మహేష్ ట్రిప్ ఉండబోతుందని టాక్. ఇక ట్రిప్ ముగిసి తిరిగి హైదరాబాద్ వచ్చిన తరువాతే గుంటూరు కారం మూవీ ప్రమోషన్స్ ప్రారంభం అవుతుందట. ఈ లోపు మేకర్స్ ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈ వెంట్ కు సంబంధించిన సన్నాహాలు ప్రారంభించారు.ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించే ప్రాంతంపై ఓ టాక్ నడుస్తోంది. త్రివిక్రమ్ కు సెంటిమెంట్ గా భావిస్తున్నా పోలీస్  గ్రౌండ్స్ లో నిర్వహిస్తారంట.

యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ ను త్రివిక్రమ్ సెంటిమెంట్ గా భావిస్తున్నారని టాక్.  ఇక్కడే త్రివిక్రమ్, బన్ని కాంబినేషన్ లో వచ్చి.. ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలిచిన ‘అల వైకుంఠపురం’  ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. బన్నీ ఈ మూవీతో ఎలాంటి రికార్డులు సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  వీరిద్దరి కెరీర్లో బిగెస్ట్ మూవీగా ఈ సినిమా నిలిచింది. ఆ కారణంతోనే గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను  కూడా ఆ గ్రౌండ్ లోనే నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

ఇక ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా జరగబోతుందని, డిసెంబర్ 6న గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని సమాచారం. ఇక మహేష్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే మరో క్రేజీ అప్డేట్ ఏమిటంటే ట్రైలర్ ను ఆ ఈవెంట్ లోనే రిలీజ్ చేయబోతున్నారు. మరి..త్రివిక్రమ్ సెంటిమెంట్ ప్రకారం “గుంటూరు కారం” మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా? అనేది వేచి చూడాలి. మరి.. గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం గురించి వినిపిస్తోన్న టాక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి