iDreamPost

ఏసీబీ వలలో మహిళా ఉద్యోగి.. కోట్ల రూపాయల ఆస్తులు

ఏసీబీ అధికారులు లంచాలు తీసుకునే అధికారలు భరతం పడుతున్నారు. తాజాగా గిరిజన సంక్షేమశాఖ ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ ఆఫ్‌ ఇంజినీర్‌(ఎస్‌ఈ) గా విధులు నిర్వహిస్తున్న కె.జగజ్యోతి లంచం డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయింది.

ఏసీబీ అధికారులు లంచాలు తీసుకునే అధికారలు భరతం పడుతున్నారు. తాజాగా గిరిజన సంక్షేమశాఖ ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ ఆఫ్‌ ఇంజినీర్‌(ఎస్‌ఈ) గా విధులు నిర్వహిస్తున్న కె.జగజ్యోతి లంచం డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయింది.

ఏసీబీ వలలో మహిళా ఉద్యోగి.. కోట్ల రూపాయల ఆస్తులు

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా కొందరి ప్రభుత్వ అధికారుల తీరు కనిపిస్తున్నది. వేలకు వేలు జీతాలు తీసుకుంటూ.. అది సరిపోదన్నట్టుగా అవినీతికి పాల్పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా పనికి సంబంధించిన ఫైల్ మూవ్ కావాలంటే చేతులు తడపాల్సిన పరిస్థితి నెలకొందనడానికి తాజాగా జరిగిన సంఘటనే ఉదాహరణగా నిలుస్తోంది. లంచగొండి అధికారులపై ఏసీబీ అధికారులు నిఘాపెట్టి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరు ఉద్యోగుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఓ మహిళా ఉద్యోగి ఆఫీసులోనే లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడింది.

గిరిజన సంక్షేమశాఖ ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ ఆఫ్‌ ఇంజినీర్‌(ఎస్‌ఈ) గా విధులు నిర్వహిస్తున్న కె.జగజ్యోతి లంచం డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయింది. ఓ కాంట్రాక్టర్ కు బిల్లులు మంజూరు చేసే విషయంలో లంచం తీసుకుని ఏసీబీ అధికారులకు చిక్కింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గంగన్న అనే కాంట్రాక్టర్‌కు నిజామాబాద్‌లో పూర్తిచేసిన పనికి బిల్లు మంజూరైంది. అదే విధంగా హైదరాబాద్‌ శివార్లలోని గాజుల రామారంలో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న జువైనల్‌ బాలుర వసతిగృహం కాంట్రాక్టునూ ఆయనే దక్కించుకున్నారు. అయితే ఈ రెండు పనులకు సంబంధించిన అనుమతుల కోసం గంగన్న ప్రభుత్వ ఉద్యోగిని కె.జగజ్యోతిని ఆశ్రయించారు.

ఆ సమయంలో తన వక్ర బుద్దిని ప్రదర్శించింది. ఆ పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇక చేసేదేం లేక కాంట్రాక్టర్ గంగన్న ఏసీబీ అధికారులకు కంప్లైంట్ చేశాడు. రంగంలోకి దిగిన అనిశా అధికారులు మాసబ్‌ట్యాంక్‌లోని కార్యాలయంలో రూ.84 వేలు లంచం తీసుకుంటున్న జగజ్యోతిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.65 లక్షల నగదు, రెండున్నర కిలోల బంగారం లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. మరి లంచం తీసుకుంటూ పట్టుబడిన ఉద్యోగినిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి