iDreamPost
android-app
ios-app

వీడియో: కావ్య మారన్‌ను లెక్కచేయని హెడ్‌! మ్యాచ్ అయ్యాక ఇది గమనించారా?

  • Published May 28, 2024 | 1:33 PM Updated Updated May 28, 2024 | 1:33 PM

Travis Head, Kavya Maran, IPL Final: కేకేఆర్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఓటమి తర్వాత కావ్య ఎస్‌ఆర్‌హెచ్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లింది. ఆ టైమ్‌లో ట్రావిస్‌ హెడ్‌ ఆమెను అస్సలు లెక్కచేయలేదు. అలా ఎందుకు చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..

Travis Head, Kavya Maran, IPL Final: కేకేఆర్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఓటమి తర్వాత కావ్య ఎస్‌ఆర్‌హెచ్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లింది. ఆ టైమ్‌లో ట్రావిస్‌ హెడ్‌ ఆమెను అస్సలు లెక్కచేయలేదు. అలా ఎందుకు చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published May 28, 2024 | 1:33 PMUpdated May 28, 2024 | 1:33 PM
వీడియో: కావ్య మారన్‌ను లెక్కచేయని హెడ్‌! మ్యాచ్ అయ్యాక ఇది గమనించారా?

ఐపీఎల్‌ 2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేసిన ప్రదర్శనకు, చూపిన పోరాట పటిమకు అంతా ఫిదా అయిపోయారు. గతంలో ఎప్పుడు జరగని విధంగా, ఐపీఎల్‌ చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డులను బద్దలు కొట్టింది ఎస్‌ఆర్‌హెచ్‌. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌(287), పవర్‌ ప్లేలో అత్యధిక స్కోర్‌(125) లాంటి క్రేజీ రికార్డులను సృష్టించింది ఆరెంజ్‌ ఆర్మీనే. కానీ, దురదృష్టవశాత్తు.. కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఓడిపోవడంతో.. కప్పు గెలవలేకపోయింది. ఫైనల్లో సన్‌రైజర్స్‌ ఓటమి ప్రతి తెలుగు క్రికెట్‌ అభిమాని గుండెను ముక్కలు చేసింది. అయితే.. ఫైనల్‌లో ఓటమి తర్వాత.. ఎస్‌ఆర్‌హెచ్‌ ఓనర్‌ కావ్య మారన్‌ టీమ్‌తో మాట్లాడారు. ఓటమి బాధలో ఉన్న ఆటగాళ్లను ఓదారుస్తూ అదిరిపోయే స్పీచ్‌ ఇచ్చారు.

అయితే.. కావ్య మారన్‌ డ్రెస్సింగ్ రూమ్‌లోకి రాగానే అంతా అలర్ట్‌ అయిపోయారు. ఆమె ఏం చెబుతుందా అని వినేందుకు ఆటగాళ్లంతా ఆసక్తి కనబర్చారు. కెప్టెన్‌ కమిన్స్‌, యువ క్రికెటర్‌ అబ్దుల్‌ సమద్‌ ఆమె పక్కనే నిల్చునున్నారు. కానీ, స్టార్‌ క్రికెటర్‌ ట్రావిస్‌ హెడ్‌ మాత్రం కావ్య మారన్‌ను అస్సలు లెక్కే చేయలేదు. ఆమె టీమ్‌ ఓనర్‌ అనే సంగతి మర్చిపోయాడో ఏంటో కానీ.. అస్సలు ఆమెను పట్టించుకోనట్లు ఉండిపోయి.. ప్రశాంతంగా కూర్చున్నాడు. అయితే.. మిగతా టీమ్‌ సభ్యులంతా లేచి నిలబడి.. కావ్య మాటలను శ్రద్ధంగా వింటుంటే.. వెంటనే అలర్ట్‌ అయిన ట్రావిస్‌ హెడ్‌ వాళ్లతో పాటు లేచి నిల్చున్నాడు. ఒకరిద్దరు ఆటగాళ్లు అలాగే కూర్చొని ఉన్నా.. హెడ్‌ కూడా అలాగే కూర్చోని ఉండేవాడని నెటిజన్లు అంటున్నారు.

క్లాస్‌ రూమ్‌లో టీచర్‌ రాగానే ఎక్కువ శాతం మంది విద్యార్థులు లేచి నిల్చుంటారు. కొందరు మాత్రం ఆ లేద్దాంలే మెల్లగా అంటూ వెనుక అలాగే కూర్చుండి పోతారు. ట్రావిస​్‌ హెడ్‌ కూడా అదే బాబతు అంటూ కొంతమంది సరదాగా కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే.. అప్పటికే ఫైనల్‌ ఓడిపోయిన బాధలో ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాళ్లను కావ్య తన మాటలతో కాస్త ఉత్సాహపర్చింది. అయితే.. ఫైనల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓడిపోగానే.. స్టాండ్స్‌లో కావ్య మారన్‌ కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించింది. అంత బాధలోనూ తన టీమ్‌ను మోటివేట్‌ చేసే ప్రయత్నం చేయడంతో కావ్య మారన్‌పై సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిసింది. మరి కావ్యను చూసి కూడా హెడ్‌ అలాగే కూర్చోని ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.