iDreamPost

పేదలకు అండగా ట్రాన్స్‌జెండర్‌.. ఈమె చేసిన సాయానికి హాట్సాఫ్!

ఈ ట్రాన్స్ జెండర్ తన మంచి మనసును చాటుకున్నారు. ఈమె చేసిన పనికి ఇప్పుడు అంతా హ్యాట్సాఫ్ చేస్తున్నారు. ఇంతకు ఈమె చేసిన పనేంటి అంటే?

ఈ ట్రాన్స్ జెండర్ తన మంచి మనసును చాటుకున్నారు. ఈమె చేసిన పనికి ఇప్పుడు అంతా హ్యాట్సాఫ్ చేస్తున్నారు. ఇంతకు ఈమె చేసిన పనేంటి అంటే?

పేదలకు అండగా ట్రాన్స్‌జెండర్‌.. ఈమె చేసిన సాయానికి హాట్సాఫ్!

ట్రాన్స్‌జెండర్‌ లను ఇప్పటికీ మన సమాజం చిన్న చూపుతో చూస్తుంది. వారు వస్తున్నారంటే చాలు ఏదో అంటరాని వారిలా చూస్తూ పక్కకు జరుగుతుంటారు. ఇంతే కాకుండా వారిపట్ల చులకన భావాన్ని కూడాచూపిస్తుంటారు. అయితే, వీళ్లల్లో కూడా కొందరు అప్పుడప్పుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. డబ్బులు ఇవ్వకపోతే ప్రజలతో గొడవకు దిగడం, వారితో ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ, అందరూ అలాగే ఉంటారనుకోవడం పెద్ద పొరపాటే. ఇదిలా ఉంటే.. రాజస్థాన్ కు చెందిన ఓ ట్రాన్స్ జెండర్ తన మంచి మనసును చాటుకున్నారు. ఈమె చేసిన పనిని తెలుసుకుని అందరూ ఆమెకు హాట్యాఫ్ చేస్తున్నారు. ఇంతకు ఈ ట్రాన్ జెండర్ చేసిన పనేంటి? అంతలా పోగడాల్సిన కారణం ఏంటి? అసలేం జరిగింగిందంటే?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని ఓ ప్రాంతంలో నీతూ ఆంటీ అనే ట్రాన్స్ జెండర్ నివాసం ఉంటున్నారు. ఆమెకు సేవ గుణం ఎక్కువ. దాదాపు 12 ఏళ్ల నుంచి ఎంతో మంద పేద ప్రజలకు అన్ని రకాలుగా సహాయం చేస్తూ వస్తున్నారు. ఇంతే కాకుండా పెళ్లిళ్లు చేసుకునే స్థితిలో ఉన్న నిరుపేద ఆడ బిడ్డలకు తన సొంత ఖర్చుతో వివాహాలు కూడా జరిపిస్తున్నారు. అయితే, 12 ఏళ్ల నుంచి ఎంతో మంది యువతులకు ఆమె పెళ్లిళ్లు జరిపించారు. ఇక తాజాగా కూడా నీతూ ఆంటీ మరో పేదింటి ఆడ బిడ్డకు వివాహం జరిపించి తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు.

అయితే, నీతూ ఆంటీ ఇప్పటికీ తన సొంత ఖర్చు వెచ్చించి 12 ఏళ్లల్లో దాదాపు 120 మంది హిందూ-ముస్లిం అమ్మాయిలకు వివాహాలు జరిపించారట. తాజాగా ఆమె చేసిన మరో పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆమె చేస్తున్న సేవ గురించి తెలుసుకుని కొందరు నెటిజన్స్ నీతూ ఆంటీకి హ్యాట్సాఫ్ చేస్తున్నారు. అయితే, సమాజంలో ట్రాన్స్‌జెండర్‌ లను చిన్న చూపు చూస్తున్న ఈ తరుణంలో అందరూ ఇలాగే ఉండరని తెలిసొచ్చేలా చేస్తున్నారు నీతూ ఆంటీ. ఈమె చేస్తున్న సేవలను ప్రతీ ఒక్కరు మెచ్చుకోవాల్సిందే. 12 ఏళ్లుగా పేదింటి ఆడ బిడ్డలకు సొంత ఖర్చుతో పెళ్లిళ్లు చేస్తున్న నీతూ ఆంటీ సేవ గుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి