iDreamPost

కరోనా సమయంలో కూడా సి.యం జగన్ పై విష ప్రచారం

కరోనా సమయంలో కూడా సి.యం జగన్ పై విష ప్రచారం

గడచిన సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఓటమిని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ఓటమికి కారణమైన వై.యస్ జగన్ పై వ్యక్తిగత కక్షను పెంచుకున్నారు. ఎట్టి పరిస్తితుల్లో ముఖ్యమంత్రిగా జగన్ అందిస్తున్న పాలనపై ప్రజల్లో సదభిప్రాయం కలగడానికి వీల్లేదని, జగన్ చేసే ప్రతి పనికి అసత్యాలను , అర్ధ సత్యాలను జోడించి సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారానికి తెరలేపారు.జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే సోషల్ మీడియాలో ఫెయిల్డ్ సి.యం అని ప్రచారం మొదలు పెట్టారంటే ఎంత అక్కసుతో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు.

జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే తన పాలనలో అవినీతికి, అక్రమాలకు తావు ఇవ్వను అని సందేశం ఇచ్చేలా గడచిన ప్రభుత్వ హయాంలో కృష్ణా నది ఒడ్డును ఆక్రమించుకుని చంద్రబాబు కట్టిన ప్రజావేదికని కూల్చితే జగన్ కూల్చే సి.యం, బాబు కట్టే సి.యం అని ప్రచారం చేశారు. కానీ జగన్ కూల్చింది చంద్రబాబు కట్టింది అక్రమ కట్టడం అనే వాస్తవాన్ని కప్పి పుచ్చే ప్రయత్నం చేశారు. ఇక జగన్ పై దాడికి ఎంచుకున్న మరో అంశం మతం. 2017లో విజయవాడలో బావాని ఐలాండ్ లో నిర్వహించిన స్పీడ్ బోట్ రేస్ సమయంలో నిర్మించిన ఒక ఆర్చ్ పై మేరి మాత బొమ్మ ఉండగా, తెలుగుదేశం సోషల్ మీడియా ఆ బొమ్మ జగన్ వేయించాడని, హిందువుల పుణ్యక్షేత్రం దగ్గర మత ప్రచారం అని విష ప్రచారానికి పూనుకున్నారు. ఈ విషప్రచారం ఏకంగా బిజేపి రాష్ట్ర అద్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తన ట్విట్టర్ లో ప్రచారం చేయడం గమనార్హం. 

ఇక వరదల సమయంలో తెలుగుదేశం కార్యకర్త శేఖర్ చౌదరి రైతు ముసుగులో జగన్ పై, మంత్రి అనిల్ కుమార్ పై దూషణలకు దిగిన దగ్గర నుంచి, మొన్నటి రోజున రొయ్యల గిట్టు బాటు దగ్గర ఫేక్ కాల్ మాట్లాడి దొరికిన తెలుగుదేశం కార్యకర్త దాకా గడచిన 11 నెలల్లో వేలకొద్ది తప్పుడూ సమచారం ప్రచారం చేశారంటే వీరు ముఖ్యమంత్రిపై జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు ఎంత వ్యక్తిగత ద్వేషంతో రగిలిపొతున్నారో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు తజాగా వీరి ద్వేషానికి పరాకాష్టగా కరోనా విపత్తు కాలంలో కూడా ముఖ్యమంత్రి పై విషప్రచారం ఆపటం లేదు.

నిన్నటి రోజున ముఖ్యమంత్రి జగన్ మీడియా సమావేశంలో అభూతకల్పనలు, అతిశయోక్తులు లేకుండా వాస్తవికతకు దగ్గరగా మట్లాడారు. కరోనాతో మనం కలిసి జీవించాల్సిందే అని చెప్పారు. అయితే తెలుగుదేశం మాత్రం కరోనాని కట్టడి చేయలేక జగన్ ఇలా మాట్లాడుతున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యారని సోషల్ మీడియా వేదికగా ఆయన మాటలను పలచన చేసే పని పెట్టుకున్నారు. నిజానికి జగన్ మాట్లాడింది వాస్తవం ప్రధాని మోడి కూడా కరోనా ముప్పు ఇప్పట్లో పోదనే చెప్పారు. దాని అర్ధం వాక్సిన్ వచ్చే వరకు ఈ మహమ్మారి బారి నుండి పూర్తిగా బయట పడలేము, అప్పటి వరకు తగు జాగ్రత్తలు తీసుకుంటి ఈ మహమ్మారితో కలిసి జీవించాల్సిదే .. ఇదే ముఖ్యమంత్రిగా జగన్ , ప్రధానమంత్రిగా మోడి చెప్పిన విషయం.

కరొనా మహమ్మారి వ్యాప్తి చెందిన దగ్గర నుండి జగన్ పై ఎలా దాడి చేద్దామా అని తెలుగుదేశం వారి కార్యకర్తలు ఎదురు చూస్తూ వచ్చారు. కరోనా రాష్ట్రంలో తగ్గుముఖం పడితే జగన్ కి మంచి పేరు వస్తుందేమో అని కరోనా ఈ రాష్ట్రంలో తగ్గకూడదు అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అంటే వీరి ఉన్మాదం ఏ స్థాయికి చేరిందో అర్ధం చేసుకోవచ్చు. తొలుత కరోనా వ్యాధిగ్రస్తులుని కనుగొనడంలో విఫలం ఆయ్యారు అన్నారు. కానీ వాస్తవానికి వాలంటీర్ల ద్వారా దేశంలో ఇంటింటి సర్వే చేయించి వ్యాధిగ్రస్తులని కనుక్కునది జగన్ ప్రభుత్వం. కరోనా టెస్టులు చేయడంలేదు అన్నారు. కానీ జగన్ ప్రభుత్వం కరోనా టెస్టులు చేయడంలో దేశంలొనే మొదటి స్థానంలో ఉంది. కొరియా కిట్లలో అవినీతి జరిగింది అన్నారు కానీ ఏకంగా కేంద్రమే రాష్ట్రం కన్న ఎకువ ధరకు కొనుగోలు చేయడంతో ఆ వాదనలో కుడా పస లేదని తేలిపోయింది.

గణాంకాల ప్రకారం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కన్న కరోనాని ఎంతో సమర్ధవంతంగా కట్టడి చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందు ఉన్నది. ఇదే విషయం సాక్షాత్తు వెంకయ్య నాయుడే చెప్పారు. కరోనా టెస్టుల్లో ఇప్పటికే 80వేల మార్క్ దాటి సమర్ధవంతంగా వ్యాధిని కనుగొనడంలో మొదటి వరసలో ఉన్నా, ఒక పక్క వ్యాధిని కట్టడి చేస్తూనే ఏ రాష్ట్రం చేయని విధంగా సంక్షేమానికి కూడా పెద్ద పీట వేశారు జగన్ ఫీజు రియంబర్స్ బకాయిలు చెల్లించారు. డ్వాక్రా మహిళలను 1400 కోట్లు విడుదల చేసి ఆదుకున్నారు. ఆక్వా పరిశ్రమకి అడ్డంగా నిలిచారు. ఇక్కట్లలోను పింఛన్ అందిస్తున్నారు. రైతు నష్టపొకుండా రాష్ట్రంలో పండే పండ్లను స్థానిక మార్కెట్ లో విక్రయించేలా ఏర్పాటు చేసారు దీంతో పాటు రైతులకు రవాణ మార్కెటింగ్ సదుపాయాలు కల్పించారు. ఇలా ఒక పక్క కరోన కట్టడిని చేస్తూనే రాష్ట్రంలో సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్న ఏకైక రాష్ట్రం జగన్ ప్రభుత్వంలో ఉన్న ఆంధ్రప్రదేశ్.

ఇలా ఎంతో సమర్ధవంతగా పరిపాలన చెస్తున్న ముఖ్యమంత్రిపై సామాజిక మాధ్యమాల్లో తమ వంతుగా సంఘీభావం తెలుపుతూ సహాయం చేయకపోగా , కరోనా లాంటి విపత్తులో కూడా కేవలం రాజకీయ కక్షతో సోషల్ మిడియా వేదికగా విషప్రచారం చేస్తూ తమకి ప్రజా శ్రేయస్సు కన్నా జగన్ పతనమే ముఖ్యం అన్నట్టు ఉన్మాదులవలే ప్రవర్తిస్తున్నారు ప్రతిపక్ష సభ్యులు. తప్పుని తప్పుగా ఎత్తి చూపిన రోజు ప్రజాస్వామ్యం వర్దిల్లుతుంది కానీ, ఒప్పుని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే సమాజంలో విషబీజాలు నాటుకుని విద్వేషాలు రగులుతాయి అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా సమాజం కన్న వారికి పీఠమే ముఖ్యంగా ప్రవర్తిస్తున్న ఈ ప్రతిపక్షాల తీరు చూపరులకి ఏవగింపుగా మారుతోందని చెప్పడంలో సందేహం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి