iDreamPost
android-app
ios-app

కుటుంబ సభ్యులు వద్దన్నా ఆ సినిమాలో నటించాను: సమంత

  • Published Jun 07, 2024 | 11:40 AM Updated Updated Jun 07, 2024 | 11:40 AM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఖుషి సినిమా తర్వాత మరి ఏ సినిమాలోనూ నటించలేదనే విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత తాను ఆ సిసిమాలో నటించవద్దని కుటంబ సభ్యులు చెప్పినా వ్యతిరేకించి చేశానంటూ పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఖుషి సినిమా తర్వాత మరి ఏ సినిమాలోనూ నటించలేదనే విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత తాను ఆ సిసిమాలో నటించవద్దని కుటంబ సభ్యులు చెప్పినా వ్యతిరేకించి చేశానంటూ పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.

  • Published Jun 07, 2024 | 11:40 AMUpdated Jun 07, 2024 | 11:40 AM
కుటుంబ సభ్యులు వద్దన్నా ఆ సినిమాలో  నటించాను: సమంత

‘సమంత రుత్ ప్రభు’.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతేకాకుండా.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. ఇక అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో తన అందం, అభినయం, నటనతో సమంత అగ్రకథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సమంత.. సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ తన నటనతో ప్రేక్షకులని మెప్పిస్తోంది. అలాగే ఇటు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా దాదాపు స్టార్ హీరోల అందరి సరసన నటించి మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సొంతం చేసుకుంది. ఇక మైయోసైటీస్ వ్యాధి బారిన పడిన తర్వాత ఈమె ‘ఖుషీ’ సినిమా చేసింది. అయితే ఆ సినిమా తర్వాత సమంత మరి ఏ సినిమాలో నటించలేదు ఇదిలా ఉంటే..ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత తాను ఆ సినిమాలో చేయకూడదు అని కుటుంబ సభ్యులు ఎంత చెప్పిన చేశానంటూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇండస్ట్రీలో వృత్తిపరంగా, వ్యక్తిగతంగానూ సమంతకు ఎంతటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగు, తమిళ్ భాషల్లో సమంత క్రేజీ హీరోయిన్ మారిపోయింది. ఇదిలా ఉంటే.. ఇటీవలే సమంత ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. కాగా, అక్కడ తాను వైవాహిక జీవితం నుంచి దూరం అయ్యేక ఆ సినిమా చేయవద్దని కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు. అయిన తాను వారి మాటకు వ్యతిరేకించి చేశానంటూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అయితే సమంత 2022లో  అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం ‘పుష్ప’ సినిమా గురించి చెప్పుకొచ్చింది. కాగా, ఆ సినిమా విడుదలై అప్పటిలో సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో సమంత ఊ అంటావా మామ పాటకు డ్యాన్స్ చేసి యూత్ ను గిలిగింతలు పెట్టించింది. ఇక ఆ పాటకు డాన్స్  చేయడానికి సమంతకు రూ. 5 కోట్లు పారితోషికం ఇచ్చినట్లు సమాచారం.

అయితే విడాకులు తీసుకున్న సమయంలో.. పుష్ప చిత్రంలో ఐటమ్ సాంగ్ ఆఫర్ వచ్చిందని, కానీ ఆ సమయంలో ఆ పాటలో తనని నటించవద్దని కుటుంబ సభ్యులు, స్నేహితులు సలహా ఇచ్చారని సమంత తెలిపింది. కానీ, తాను వారి మాటను వ్యతిరేకించి ఆ పాటలో నటించనాని, ఇక ఆ పాటు అప్పటిలో పెద్ద టర్నింగ్ గా మారిన విషయం తెలిసిందేనని సమంత పేర్కొంది. అసలు నిజం చెప్పాలంటే.. తాను ఆ అవకాశాన్ని కాదనడానికి తన వద్ద సరైన కారణం లేదని, అలాంటప్పుడు తాను ఎందుకు దాన్ని నిరకారించాలి అని చెప్పుకొచ్చారు. అలాగే వైవాహిక జీవితంలో తాను వందకు వంద శాతం నిజాయితీగా ఉన్నానని, తాను ఏ తప్పు చేయలేదని చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయం పాతదే కానీ ప్రస్తుతం సమంత చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి, పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ గురించి సమంత చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletPokerklasPokerklasPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasKulisbet girişmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişJojobet GirişHoliganbetMarsbahis