iDreamPost
android-app
ios-app

ఒకప్పుడు తెలుగులో స్టార్‌ హీరోయిన్‌.. ఇప్పుడు ఎలా మారిపోయిదంటే

  • Published Jun 09, 2024 | 2:07 PM Updated Updated Jun 09, 2024 | 2:07 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో అలరించిన ఈ హీరోయిన్ ఎవరికైనా గుర్తుందా..? ఇప్పుడు ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా మారిపోయిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం ఈమె లేటెస్ట్ ఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో అలరించిన ఈ హీరోయిన్ ఎవరికైనా గుర్తుందా..? ఇప్పుడు ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా మారిపోయిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం ఈమె లేటెస్ట్ ఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • Published Jun 09, 2024 | 2:07 PMUpdated Jun 09, 2024 | 2:07 PM
ఒకప్పుడు తెలుగులో స్టార్‌ హీరోయిన్‌.. ఇప్పుడు ఎలా మారిపోయిదంటే

యంగ్ టైగర్ ‘ఎన్టీఆర్’ ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అలాంటి చిత్రాల్లో ‘యమదొంగ’ సినిమా కూడా ఒకటి. కాగా ఈ సినిమాను డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా 2007లో విడుదలై ఎంత సూపర్ హిట్ గా నిలిచిందో అందరికి తెలిసిందే. అంతేకాకుండా.. ఈ సినిమా ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో నంది అవార్డ్ సైతం అందుకుంది. ఇక ఇందులో ఎన్టీఆర్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటించింది. అలాగే ఇందులో మోహన్ బాబు, ఖుష్బూ, అలీ, బ్రహ్మానందం, అర్చన, ప్రీతి జంగ్యాని, నవనీత్ కౌర్, రంభ, ఎంఎస్ నారయణ కీలక పాత్రలు పోషించారు. అయితే వీరితో పాటు ఈ సినిమాలో నెల్లూరు యాసలో మాట్లాడుతూ ఎన్టీఆర్ ను ముప్పు తిప్పలు పెట్టిన హీరోయిన్ ‘మమతా మోహన్ దాస్’ అందరికి గుర్తేండే ఉంటుంది. కాగా, ఈ సినిమాలో ఎన్టీఆర్, మమతా మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా అలరించాయి.అలాగే ఈ సినిమాతో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ వచ్చిందనే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే.. ఈ చిన్నదానికి అప్పటిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండేది. దీంతో తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది మమతా హోహన్ దాస్. కానీ, యమదొంగ సినిమాతో వచ్చిన క్రేజ్ మరి ఏ సినిమాతో అందుకోలేకపోయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ బ్యూటీ ఎలా మారిపోయిదో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

టాలీవుడ్ హీరోయిన్ ‘మమతా మోహన్ దాస్’ యమదొంగ సినిమాలో అలరించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లు అందుకొని కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలో ఈ బ్యూటీ క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో కొన్నాళ్లపాటు క్యాన్సర్ చికిత్స తీసుకుని ఆరోగ్యంగా బయటపడింది.ఆ తర్వాత చాలాకాలం పాటు విశ్రాంతి తీసుకున్న మమతా.. మలయాళంలో పలు చిత్రాల్లో నటించింది. అలాగే ఇటీవలే తెలుగు సినీ పరిశ్రమలోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. కాగా, విలక్షణ నటుడు జగపతి బాబు నటించిన ‘రుద్రంగి’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది మమతా. అయితే ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ తెలుగులో మరో ప్రాజెక్ట్ చేయలేదు. కానీ, మలయాళంలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన మహారాజా చిత్రంలో కీలకపాత్ర పోషించింది. ఈ సినిమా ఈనెల అనగా జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలోనే మహారాజా సినిమా ప్రమోషన్లలో పాల్గొంటుంది మమతా మోహన్ దాస్.ప్రసతం ఆమె లేటెస్ట్ ఫిక్స్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోస్ చూసిన నెటిజన్స్ ఇప్పటికి కూడా ఈ మమతా చాలా అందంగా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక మమతా మోహన్ దాస్ సినిమాల విషయానికొస్తే.. ఈమె తెలుగులో యమదొంగ, చింతకాయల రవి, కృష్ణార్జున, హోమం చిత్రాల్లో నటించింది. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మమతా మోహన్ దాస్ లేటెస్ట్ ఫిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişJojobetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişHoliganbet Girişmadridbet güncel girişmadridbet