iDreamPost
android-app
ios-app

లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. ఫొటోలు వైరల్‌

  • Published Feb 27, 2024 | 11:49 AM Updated Updated Feb 27, 2024 | 11:49 AM

ప్రస్తుతం పెళ్లిల సీజన్ కావడంతో ఇటు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరూ వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. అయితే తాజాగా మరో టాలీవుడ్ హీరోయిన్ కూడా పెళ్లి పీటలు ఎక్కింది. ఇంతకి ఆమె ఎవరంటే..

ప్రస్తుతం పెళ్లిల సీజన్ కావడంతో ఇటు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరూ వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. అయితే తాజాగా మరో టాలీవుడ్ హీరోయిన్ కూడా పెళ్లి పీటలు ఎక్కింది. ఇంతకి ఆమె ఎవరంటే..

  • Published Feb 27, 2024 | 11:49 AMUpdated Feb 27, 2024 | 11:49 AM
లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. ఫొటోలు వైరల్‌

ప్రస్తుతం పెళ్లిల సీజన్ కావడంతో ఇటు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇండస్ట్రీలో వరుస పెళ్లి బాజాలు మోగుతున్నాయి. చాలామంది సెలబ్రీటిస్ తమ బ్యాచలర్ లైఫ్ కు సెండ్ ఆప్ ఇస్తూ.. వైవాహిక బంధంలోకి అడుగు పెడుతున్నారు. మొన్ననే టాలీవుడ్ హీరోయిన్ రకుల్ తన ప్రియుడు జాకీ భగ్నా తో ఘనంగా వివాహం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరో టాలీవుడ్ హీరోయిన్ కూడా తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి పీటలు ఎక్కింది. అయితే ఈ బ్యూటీ ఇండస్ట్రీలో పలువురు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఈ క్రమంలోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇంతకి ఆమె ఎవరంటే..

టాలీవుడ్ హీరోయిన్ ‘అక్ష పార్దసాని’. ఈ పేరుతో సినీ ప్రేక్షకులు గుర్తుపట్టడం కష్టం. ఎందుకంటే.. తెలుగు చిత్ర పరిశ్రమలో అక్ష చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఈమె ఈమె అందం, అభినయంతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈ క్రమంలోనే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో రామ్ పోతినేని, నిఖిల్ సిద్ధార్థ్ వంటి హీరోలతో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో వరుస ఆఫర్స్ అందుకున్న హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. అయితే తాజాగా ఈ బ్యూటీ తన ప్రియుడితో కలిసి ఏడడుగులు వేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

హీరోయిన్  అక్ష పార్దసాని, బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కౌశల్ ను వివాహం చేసుకుంది. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు పెద్దల్ని ఒప్పించి కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఫిబ్రవరి 26న గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇక వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను అక్ష తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది. అయితే ఈ వేడుకలో పెళ్లి కొడుకు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాడు. ఎందుకంటే.. సాధారణంగా నార్త వెడ్డింగ్స్ లో ఎక్కువగా పెళ్లి కొడుకులు గుర్రంపై ఊరెంగిస్తుంటారు. కానీ, కౌశల్ మాత్రం సినిమాటోగ్రాఫర్ కావడంతో.. షూటింగ్ కు వాడే కెమెరా క్రేన్ మీద కూర్చొని పెళ్లిలోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ వీటిని చూసి ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. అలాగే కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక అక్ష పార్దసాని 2007లో ‘గోల్’ అనే సినిమాతో మలయాళం సినిమాలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత ఏడాదిలోనే ‘యువత’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే రామ్ పోతినేనితో ‘కందిరీగ’,’రైడ్, బెంగాల్ టైగర్’, ‘శత్రువు’, ‘రాధా’, ‘డిక్టేటర్’ లాంటి చిత్రాల్లో నటించి అలరించింది. కానీ 2017 తర్వాత ఈ ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్స్ రాలేదు. దీంతో ఇండస్ట్రీకి దూరమై బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అక్కడే పలు చిత్రాలు, వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంటుంది. అయితే ఈమె చేసిన వెబ్ సిరీస్ లో ‘ఖాట్మండు కనెక్షన్’, ‘జమ్తారా’, ‘రఫు చక్కర్’ వంటి వెబ్ సిరీస్ చేసి ఓటీటీ ప్లాట్ ఫామ్ పై సక్సెస్ అయ్యయి. మరి, ప్రస్తుతం వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

View this post on Instagram

 

A post shared by Aksha Pardasany (@akshapardasany)

jojobet girişmarsbahiscasibomjojobet girişcasibomJojobet Giriş