iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ డైరెక్టర్స్ కొత్త ట్రెండ్. యాడ్స్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు!

  • Published Mar 09, 2024 | 5:52 PM Updated Updated Mar 09, 2024 | 5:52 PM

ప్రస్తుతం స్టార్ హీరోస్ అంత సినిమాలతో పాటు.. ప్రముఖ బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ .. యాడ్ షూట్స్ ను కూడా చేస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు వీరికి పోటీగా స్టార్ డైరెక్టర్స్ కూడా యాడ్స్ డైరెక్ట్ చేయడానికి రెడీ అయిపోతున్నారు.

ప్రస్తుతం స్టార్ హీరోస్ అంత సినిమాలతో పాటు.. ప్రముఖ బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ .. యాడ్ షూట్స్ ను కూడా చేస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు వీరికి పోటీగా స్టార్ డైరెక్టర్స్ కూడా యాడ్స్ డైరెక్ట్ చేయడానికి రెడీ అయిపోతున్నారు.

  • Published Mar 09, 2024 | 5:52 PMUpdated Mar 09, 2024 | 5:52 PM
టాలీవుడ్ డైరెక్టర్స్ కొత్త ట్రెండ్. యాడ్స్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు!

ఓ సినిమాను డైరెక్ట్ చేసి దానిని సెట్స్ పైకి తీసుకుని వెళ్లాలంటే.. చాల సమయం పడుతుంది. అంత కష్టపడినా ఆ సినిమా హిట్ అవుతుందో .. ప్లాప్ అవుతుందో సినిమా రిలీజ్ అయ్యేవరకు ఎవ్వరూ చెప్పలేరు. ఒక సినిమా హిట్ అయితే భారీగా లాభాలు రావొచ్చు. అలానే ఓ సినిమా ప్లాప్ అయితే భారీగా నష్టాలను చవి చూసే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఇప్పుడు చాల మంది డైరెక్టర్స్ కేవలం సినిమాల మీద ఆధారపడకుండా .. అడ్వేర్టైస్మెంట్స్ మీద కూడా దృష్టిని పెడుతున్నారు. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు ప్రముఖ బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే డైరెక్టర్స్ కూడా ఇదే బాటను అనుసరిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

డబ్బులు సంపాదించడం ఇప్పుడు అందరికి ముఖ్యమైన విషయమే. ఇక సినీ రంగానికి వస్తే .. ఇందులో డబ్బులు సంపాదించడం అనేది రిస్క్ అండ్ లక్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి, డబ్బులు సంపాదించడం కోసం కేవలం సినిమాల మీద ఆధారపడకుండా ఇప్పుడు కొంతమంది .. యాడ్స్ మీద ఫోకస్ చేస్తూ.. డబ్బులను సంపాదించుకుంటున్నారు. ఈ తరహాలో ఇప్పటికే మహేష్ బాబు, తారక్, చరణ్, విజయ్ దేవరకొండ లాంటి ఎంతో మంది స్టార్ సెలెబ్రిటీలు.. ఇప్పటివరకు ఎన్నో అడ్వేర్టైస్మెంట్స్ లో కనిపించారు. దీని ద్వారా కూడా కోట్ల రూపాయలను సంపాదించుకుంటున్నారనే టాక్ నడుస్తోంది.. ఇక ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ కూడా ఇదే ట్రెండ్ ను స్టార్ట్ చేశారు. ఒక సినిమా తీయాలంటే కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. అదే ఒక యాడ్ షూట్ చేయాలంటే కేవలం ఒక వారం రోజుల సమయం మాత్రమే పడుతుంది.

అంతేకాకుండా, కొద్దీ రోజులు షూట్ చేసి భారీగా రెమ్యూనిరేషన్ తీసుకోవచ్చట. దీనితో డైరెక్టర్స్ అంతా ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. అటు హీరోలతో పాటు.. ఇటు దర్శకులు కూడా సెకండ్ ఎర్నింగ్ కింద..ఈ యాడ్స్ షూట్స్ ను పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన త్రివిక్రమ్ ఈ యాడ్ షూట్స్ ను ఎక్కువగా డైరెక్ట్ చేస్తూ ఉంటారు. మహేష్ బాబు నటించిన చాలా యాడ్స్ త్రివిక్రమ్ డైరెక్ట్ చేసినవే. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి మహేష్ కోసం మరో .. యాడ్ ను షూట్ చేస్తున్నారు. వీరితో పాటు .. తరుణ్ భాస్కర్, క్రిష్, సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకులు కూడా సినిమాల కన్నా .. యాడ్స్ షూట్స్ ను ఎక్కువగా చేశారు. చూడబోతుంటే.. రానున్న స్టార్ డైరెక్టర్స్ షూట్ చేస్తేనే .. తాము యాడ్ షూట్స్ చేస్తాము అనే హీరోలు .. ఎక్కువైపోయినా ఆశ్చర్యం లేదు. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetBetebetkatlaCasibom GirişMarsbahis GirişCasibom GirişcasinoroyalHoliganbet Giriş