iDreamPost
android-app
ios-app

సైలెంట్‌గా OTTలోకి తెలుగు కామెడీ థ్రిల్ల‌ర్‌! చూసినంత సేపు నవ్వులే!

  • Published Apr 02, 2024 | 1:23 PMUpdated Apr 02, 2024 | 1:35 PM

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో కొన్ని సినిమాలు ఎటువంటి హడావిడి, ముందస్తు ప్రకటనలు లేకుండా స్ట్రీమింగ్ అవుతుంటాయి. అటువంటి సినిమాలను కనుక లైట్ తీసుకుంటే మాత్రం .. మంచి ఎంటర్టైన్మెంట్ మిస్ అయినట్లే. ఈ తరహాలోనే ఓటీటీలోకి ఓ కొత్త కామెడీ థ్రిల్లర్ సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చేసింది.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో కొన్ని సినిమాలు ఎటువంటి హడావిడి, ముందస్తు ప్రకటనలు లేకుండా స్ట్రీమింగ్ అవుతుంటాయి. అటువంటి సినిమాలను కనుక లైట్ తీసుకుంటే మాత్రం .. మంచి ఎంటర్టైన్మెంట్ మిస్ అయినట్లే. ఈ తరహాలోనే ఓటీటీలోకి ఓ కొత్త కామెడీ థ్రిల్లర్ సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చేసింది.

  • Published Apr 02, 2024 | 1:23 PMUpdated Apr 02, 2024 | 1:35 PM
సైలెంట్‌గా OTTలోకి తెలుగు కామెడీ థ్రిల్ల‌ర్‌! చూసినంత సేపు నవ్వులే!

ప్రతి వారం ఓటీటీలో పదుల కొద్దీ సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. జోనర్ తో, భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకుల ఇంట్రెస్ట్ కు తగినట్లు ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. పైగా ప్రేక్షకులకు ఎటువంటి కన్ఫ్యూషన్ లేకుండా.. ఏ సినిమాలు చూడాలి, ఏ సినిమాలు బెస్ట్ అని చెప్పడం కోసం.. కొన్ని మూవీ సజ్జెషన్స్ కూడా ఇస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాము. దాదాపు ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలన్నీ కూడా ఎక్కడో ఒక దగ్గర బజ్ నడుస్తూనే ఉంటుంది. కానీ, కొన్ని సినిమాలు మాత్రం.. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతున్నాయి కదా అని వాటిలో స్టోరీ లేదు అనుకుంటే మాత్రం పొరపాటే. ఈ క్రమంలోనే తాజాగా ఓ టాలీవుడ్ లేటెస్ట్ కామెడీ థ్రిల్ల‌ర్ “కిస్మ‌త్” అనే సినిమా సైలెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి.

ఈ టాలీవుడ్ కామెడీ థ్రిల్ల‌ర్ “కిస్మ‌త్” సినిమాకు.. శ్రీనాథ్ ద‌ర్శ‌క‌త్వం వచించారు. కాగా, ఈ సినిమాలో న‌రేష్ అగ‌స్త్య‌, అభిన‌వ్ గోమ‌టం, విశ్వ‌దేవ్ హీరోలుగా న‌టించారు. వీరితో పాటు అవసరాల శ్రీనివాస్ కూడా.. ముఖ్య పాత్ర పోషించారు. అయితే, ఈ సినిమా.. ఫిబ్రవరి 2న థియేటర్ లో రిలీజ్ అయింది. అభిన‌వ్ గోమ‌టం, న‌రేష్ అగ‌స్త్య యాక్టింగ్ తో నవ్వులు పండించినా కూడా.. అదే సమయంలో ఈ సినిమాకు పోటీగా.. బాక్సాఫీస్ వ‌ద్ద ఎనిమిది సినిమాలు రిలీజ్ అవ్వగా ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఫిబ్రవరి 2న థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో.. ఈ సినిమాకు ఫెయిల్యూర్ టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఎటువంటి హడావిడి లేకుండా.. సైలెంట్ గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి, ఓటీటీలో ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

ఇక కిస్మ‌త్ సినిమా కథ విషయానికొస్తే.. న‌రేష్ అగ‌స్త్య‌, అభిన‌వ్ గోమ‌టం, విశ్వ‌దేవ్‌ ఊరిలో జరిగిన కొన్ని గొడవల కారణంగా.. ఊరిని వదిలిపెట్టి.. హైదరాబాద్ కు వెళ్తారు. అక్కడ బ్యాక్ డోర్ ద్వారా ఐటీ జాబ్ సంపాదించాలని.. ఒక కంపెనీలో డబ్బు ఇన్వెస్ట్ చేస్తారు. కానీ, చివరకు ఆ కంపెనీ మూతపడడంతో.. ఆ ముగ్గురు స్నేహితుల జీవితాలు కష్టాల్లో పడతాయి. సరిగ్గా అదే టైం లో వాళ్లకు ఇర‌వై కోట్ల రూపాయ‌లు దొర‌కుతాయి. కానీ ఆ డబ్బు ఒక పొలిటికల్ లీడర్ కుచెందింది. మరి ఈ ముగ్గురు స్నేహితులు ఆ డబ్బుతో ఏం చేస్తారు. అసలు ఆ పొలిటికల్ ఎవరు. వీరు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కుంటారు అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి, ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి