iDreamPost

Tollywood Block Busters : దూసుకుపోతున్న టాలీవుడ్ బ్లాక్ బస్టర్స్

Tollywood Block Busters : దూసుకుపోతున్న టాలీవుడ్ బ్లాక్ బస్టర్స్

తెలుగులో బ్లాక్ బస్టర్ రన్ ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న అఖండ తమిళంలోకి వెళ్తోంది. డబ్బింగ్ చేసి రేపు థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం కాబోలు అడ్వాన్స్ బుకింగ్ యాప్స్ లో ఇంకా అప్ డేట్ చేయలేదు. తెలుగు వెర్షన్ హాట్ స్టార్ లో వచ్చాక దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ దీన్ని ఎగబడి చూశారు. చాలా ట్వీట్లు పడ్డాయి. బాష అర్ధం కాకపోయినా సబ్ టైటిల్స్ సహాయంతో చూసి మరీ ఎంజాయ్ చేశారు. బాలయ్య విశ్వరూపాన్ని, హిందూ మతం శివుడి తత్వం గురించి కమర్షియల్ సినిమాలో జొప్పించి తీరు మెజారిటీ జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే ఇప్పుడీ అవకాశాన్ని వాడుకుంటోంది.

నిజానికి అఖండ హిందీ డబ్బింగ్ కోసం చాలా డిమాండ్ ఉంది. రీమేక్ రైట్స్ అమ్మారని ఆలస్యం చేస్తున్నారో లేక ఇంకా నిర్ణయం తీసుకోలేదో తెలియదు కానీ మొత్తానికి ఓ రెండు రోజులు దీని మీద సోషల్ మీడియా ట్రెండింగ్ కూడా నడిచింది. చాలా కాలం నుంచి బాలకృష్ణ సినిమాలు తమిళంలోకి వెళ్లడం లేదు. కారణం ఫెయిల్యూర్స్. లెజెండ్ ని చేశారు కానీ అది పెద్దగా వెళ్ళలేదు. కానీ అఖండకు అలా కాదు. జనానికి కనెక్ట్ అయ్యే అంశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి అక్కడా ఆడేందుకు ఛాన్స్ ఉంది. ఎలాగూ కోలీవుడ్ లోనూ ఇంకో వారం పది రోజుల దాకా చెప్పుకోదగ్గ రిలీజులు లేవు. సో ఇది మంచి తరుణం.

ఓటిటిలో వచ్చాక మన లేటెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఆన్ లైన్ లో గట్టిగానే హల్చల్ చేస్తున్నాయి. శ్యామ్ సింగ రాయ్ నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చి నాన్ ఇంగ్లీష్ టాప్ 3లోకి దూసుకుపోయింది. ఇది ఈ ఏడాదిలోనే అరుదైన రికార్డుగా చెబుతున్నారు. సూర్యవంశీని నాని క్రాస్ చేయడం గమనార్హం. తక్కువ గ్యాప్ లో అధిక శాతం వ్యూయర్స్ మన శ్యామ్ ని చక్కగా చూశారు. పుష్ప కూడా అమెజాన్ ప్రైమ్ కు కల్పతరువుగా మారి భారీ స్థాయిలో వ్యూస్ ని తెచ్చి పెట్టింది. ఇంకే భాషలోనూ ఈ రేంజ్ లో థియేటర్లలో ఓటిటిలో సినిమాలు హడావిడి చేసిన దాఖలాలు లేవు. టాలీవుడ్ రేంజ్ మరి ఆ స్థాయికి ఎదిగిపోయింది. నెక్స్ట్ వంతు బంగార్రాజుదే

Also Read : RRR : పునీత్ కోసం రాజమౌళి త్యాగం తప్పదా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి