iDreamPost

Star maa-Akhanda బుల్లితెరపై అఖండ – తేడా వచ్చిందే

Star maa-Akhanda బుల్లితెరపై అఖండ – తేడా వచ్చిందే

గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ వసూళ్లు రాబట్టి బాలయ్య బోయపాటికి హ్యాట్రిక్ హిట్ ఇచ్చిన అఖండ బుల్లితెరపై మాత్రం ఆశించిన మేజిక్ చేయలేకపోయింది. అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాల పేరు మీదున్న టాప్ టిఆర్పిని దాటేస్తుందని ఆశించారు కానీ అది జరగలేదు. 13.31 రేటింగ్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫస్ట్ టైం వరల్డ్ ప్రీమియర్ కు రావాల్సిన నెంబర్ అయితే ఇది కాదు. ఉప్పెనకు ఇంతకన్నా ఎక్కువే వచ్చింది. అర్బన్ కన్నా రూరల్ ఆడియన్స్ ఎక్కువగా చూస్తారన్న అంచనాలు ఎక్కడో తప్పాయి. అయినా కూడా ఇది మరీ నిరాశపరిచేది కాదు కానీ ఆశ్చర్యం కలిగించేదే.

దీనికి కొన్ని కారణాలు లేకపోలేదు. మొదటిది IPL 2022 సీజన్. జనం క్రికెట్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏ మ్యాచ్ ఉన్నా సాయంత్రం అయితే చాలు వాటికి అతుక్కుపోతున్నారు. రెండోది ఇప్పటికే అఖండ HotStarలో భీభత్సంగా ఆడేసింది. దానికి తోడు లోకల్ ఛానల్స్ లో పలుమార్లు రిపీట్ టెలికాస్ట్ చేసి కేబుల్ ఆపరేటర్లు పిండేశారు. సో Star Maaలో వచ్చినప్పుడు సహజంగానే యాడ్స్ ని భరిస్తూ అంత సేపు చూసే పబ్లిక్ తగ్గిపోయారు. ఒకవేళ ఓటిటి కన్నా ముందు శాటిలైట్ ఛానల్ లో వచ్చి ఉంటే ఆ కథ వేరుగా ఉండేది. మూడో కారణం రిలీజ్ టైంలో ఇంకే సినిమాలు లేకపోవడం కూడా ఆ స్థాయిలో కలెక్షన్లు రావడానికి కారణం అయ్యింది.

కొన్ని సార్లు ఈ టిఆర్పి కథలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. బయట డిజాస్టర్ అయిన సర్దార్ గబ్బర్ సింగ్ మొదటిసారి టీవీలో వచ్చినప్పుడు ఏకంగా 10కి పైగా రేటింగ్ తో అప్పట్లో టాప్ గా నిలిచింది. కొన్నిసార్లు బ్లాక్ బస్టర్లు అద్భుతాలు చేయలేకపోతాయి. అఖండకు జరిగింది అదే. ఏది ఏమైనా ఓటిటి పెరిగాక దాని ప్రభావం చాలా తీవ్రంగా ఛానల్స్ మీద పడుతోంది.. వాటిలో ప్రీమియర్స్ కి, టీవీలో ఫస్ట్ టైం టెలికాస్ట్ కి మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండటంతో బుల్లితెరపై వచ్చినప్పుడు చూసే ఎగ్జైట్ మెంట్ తగ్గిపోతోంది. రాబోయే రోజుల్లో కొత్త కొత్త ప్లాట్ ఫార్మ్స్ వస్తున్నాయి కాబట్టి స్మార్ట్ ప్రభంజనాన్ని తట్టుకోవడం అంత సులభంగా ఉండదు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి