iDreamPost
android-app
ios-app

వీడియో: టోల్‌ ప్లాజా హర్రర్‌.. మహిళపై సిబ్బంది దాడి!

  • Published Sep 23, 2023 | 4:09 PM Updated Updated Sep 23, 2023 | 4:09 PM
  • Published Sep 23, 2023 | 4:09 PMUpdated Sep 23, 2023 | 4:09 PM
వీడియో: టోల్‌ ప్లాజా హర్రర్‌.. మహిళపై సిబ్బంది దాడి!

ఈ మధ్య కాలంలో ట్లోల్‌ ప్లాజాల వద్ద దారుణాలు బాగా పెరిగిపోయాయి. యాక్సిడెంట్లు.. గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా, ఓ టోల్‌ ప్లాజా వద్ద దారుణమైన సంఘటన జరిగింది. ఓ మహిళపై టోల్‌ ప్లాజా సిబ్బంది దాడికి దిగారు. భర్త కళ్లముందే ఆమెను దారుణంగా చితకబాదారు. భర్తను కూడా వదల్లేదు. తాగి నడుపుతున్నారన్న కారణంతో ఈ ఘాతుకానికి తెగించారు. ఈ సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

హర్యానాలోని సోనిపత్‌కు చెందిన ఓ జంట కారులో వెళుతూ ఉంది. సోనిపత్‌ టోల్‌ ప్లాజా దగ్గర సిబ్బంది వీరి కారును ఆపారు. రాంగ్ డైరెక్షన్‌లో వస్తున్నారంటూ ఆ దంపతులతో గొడవకు దిగారు. ఆ గొడవ చినికి చినికి గాలి వానలా తయారైంది. దాదాపు 7 మంది సిబ్బంది ఆ దంపతులపై దాడికి దిగారు. మహిళ అని చూడాకుండా ఆమె జుట్టు పట్టుకుని మరీ కొట్టారు. అంతటితో ఆగుకుండా మూతిపై పిడిగుద్దులు కురిపించారు. కొన్ని నిమిషాల పాటు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఈ మధ్య కాలంలో ఇలాంటి గొడవలు బాగా ఎక్కువయ్యాయి’’..‘‘ పాపం మహిళ అన్న కనికరం లేకుండా కొట్టడం దారుణం’’.. ‘‘ సినమాల్లోనే ఇలాంటి ఫైట్లు చూస్తూ ఉంటాం’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక, ఈ సంఘటనపై ముర్తాల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio