iDreamPost

ప్రాణాలు తీసిన బైక్ సరదా! నలుగురు విద్యార్థుల మృతి

Warangal Crime News: అతి వేగం.. ప్రాణాలకు ప్రమాదం అని చెబుతుంటారు. అయినా ఎవరూ పట్టించుకోరు. ఇటీవల యూత్ చాలా వరకు బైక్ రైడింగ్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.

Warangal Crime News: అతి వేగం.. ప్రాణాలకు ప్రమాదం అని చెబుతుంటారు. అయినా ఎవరూ పట్టించుకోరు. ఇటీవల యూత్ చాలా వరకు బైక్ రైడింగ్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.

ప్రాణాలు తీసిన బైక్ సరదా! నలుగురు విద్యార్థుల మృతి

ఇటీవల ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్లు చేసే తప్పిదాలకు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. నిర్లక్ష్యం, నిద్రమత్తు, అవగాణ లేమి, అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా.. డ్రైవర్లలో మార్పు రావడం లేదు. ఇటీవల యూత్ కి బైక్ రైడింగ్ పై విపరీతమైన వ్యామోహం పెరిగిపోయింది. బైక్ ఉంటే చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది బైక్ పై వెళ్తూ రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నలుగురు ఇంటర్ విద్యార్థులు బైక్ పై వెళ్తూ ప్రమాదానికిగురై కన్నుమూశారు. ఈ విషాద ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

వరంగల్ జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. వర్ధన్నపేట నగర శివారు ఆకేరు వాగు వద్ద వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు ఇంటర్ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్ధన్న పేటకు చెందిన పొన్నం గణేశ్, ఇల్లంద గ్రామానికి చెందిన మల్లపాక సిద్దు, వరుణ్ తేజ్, పొన్నాల కుమార్ ఒకే బైక్ పై ఇల్లంద నుంచి వర్ధన్న పేట వైపు బయలుదేరారు. అంతలోనే ఎదురుగా వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బైక్ ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే కన్నుమూశారు. తీవ్రంగా గాయపడ్డ మరో విద్యార్థిని ఎంజీఎం హాస్పిటల్ కి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

బుధవారం వెల్లడైన ఇంటర్ ఫలితాల్లో గణేశ్ పాసయ్యాడు. ఈ క్రమంలోనే తన ముగ్గురు స్నేహితులతో పార్టీ చేసుకొని హ్యాపీగా బైక్ పై తిరిగి ఇంటికి బయలుదేరారు. అంతలోనే మృత్యు రూపంలో బస్సు ఎదురైంది. ప్రమాద తీవ్రతకు నలుగురు విద్యార్థులు దాదాపు 50 మీటర్ల దూరంలో చెల్లాచెదురుగా ఎగిరి పడ్డారు. మరో దురదృష్టకర విషయం ఏంటంటే.. వీరంతా తల్లిదండ్రులకు ఒక్కరే కుమారులు. బంగారం లాంటి భవిష్యత్ ఉన్న ముగ్గురు ఒకేసారి కన్నుమూయడంతో ఇల్లంద గ్రామంలో విషాదచాయలు అలుముకున్నారు. ఘటనా స్థలం వద్ద మలుపు ఉందని.. ఆ సమయంలో రెండు వాహనాలు వేగంగా రావడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి