iDreamPost

విషాదం: లోయలో పడ్డ బస్సు.. 20 మంది మృతి

అనారోగ్య సమస్యలతో మరణించే వారి కన్నా.. రోడ్డు ప్రమాదాలతో చనిపోతున్న వారి సంఖ్యే అధికంగా ఉంది. ప్రతి చోట ఏదో ఒక ప్రాంతంలో రోడ్లు రక్తమోతున్నాయి. తాజాగా జరిగిన ఓ ఘోర ప్రమాదంలో 20 మంది మరణించారు.

అనారోగ్య సమస్యలతో మరణించే వారి కన్నా.. రోడ్డు ప్రమాదాలతో చనిపోతున్న వారి సంఖ్యే అధికంగా ఉంది. ప్రతి చోట ఏదో ఒక ప్రాంతంలో రోడ్లు రక్తమోతున్నాయి. తాజాగా జరిగిన ఓ ఘోర ప్రమాదంలో 20 మంది మరణించారు.

విషాదం: లోయలో పడ్డ బస్సు.. 20 మంది మృతి

రోడ్డు ప్రమాదాలు జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. బయటకు వెళితే.. ఇంటికి తిరిగి వస్తామన్న గ్యారెంటీ లేకుండా పోయింది. మన జాగ్రత్తలో మనం ఉన్నా..ఊహించని రీతిలో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అనారోగ్య సమస్యలతో బాధపడే వారి కన్నా.. రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, నిద్ర లేమీ, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్లలో వాహనాలు నడపడం ఈ యాక్సిడెంట్లకు కారణాలవుతున్నాయి. పెద్దలకు.. పిల్లల్ని లేకుండా చేస్తున్నాయి. పెద్దలను కోల్పోయి పిల్లలు అనాధలుగా మారిన ఘటనలు ఉన్నాయి. తాజాగా ఓ రోడ్డు ప్రమాదం ఒకరు కాదు, ఇద్దరు కాదు.. 20 మందిని బలి తీసుకుంది.

మన పొరుగు దేశం పాకిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆక్రమిత కాశ్మీర్‌లోని గిల్గిట్- బాల్టిస్తాన్ ప్రాంతంలోని డైమర్ జిల్లాలో కారకోరం మార్గంలో బస్సు ప్రమాదానికి గురైంది.  వేగంగా వెళ్తున్న బస్సు కొండపై నుండి లోయలోకి పడిపోయింది. బస్సులో 40 మందికి పైగా ప్రయాణీకులు ఉన్నారు. బస్సు పాకిస్తాన్‌లోని రావల్పిండి నుండి పీఓకేలోని హుంజాకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారు జామున 5.30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళుతూ సింధు నదిలో పడిపోయింది. 20 మంది ఘటనా స్థలిలోనే మరణించారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రుల్లో కొంత మంది పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సమాచారం అందుకున్నరెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఆర్మీ హెలికాఫ్టర్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. గాయపడిన వారిని, మరణించిన వారిని చిలాస్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై గిల్గిత్ బాల్టిస్థాన్ సీఎం హాజీ గుల్బర్ ఖాన్ సంతాపం వ్యక్తం చేశారు. అలాగే దేశ ప్రధాని షరీఫ్ సైతం దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హోం మంత్రి మొహ్సిన్ నఖ్వీ కూడా ఘటనపై విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రధాని షరీఫ్ అధికారులను ఆదేశించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి