iDreamPost

డ్రైవింగ్ చేస్తుండగా డ్రైవర్ కి గుండెపోటు.. ఏం చేశాడంటే!

ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా వరుసగా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. కారణాలు ఏవైనా అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్నవాళ్లు హఠాత్తుగా కన్నుమూస్తున్నారు.

ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా వరుసగా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. కారణాలు ఏవైనా అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్నవాళ్లు హఠాత్తుగా కన్నుమూస్తున్నారు.

డ్రైవింగ్ చేస్తుండగా డ్రైవర్ కి గుండెపోటు.. ఏం చేశాడంటే!

ఇటీవల దేశంలో గుండెపోటు మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా మనతో గడిపిన వాళ్లు హఠాత్తుగా కుప్పకూలిపోతున్నారు. ఆస్పత్రికి తరలించేలోపు కన్నుమూస్తున్నారు. చిన్న వయసు నుంచి వృద్దుల వరకు గుండెపోటుకు గురై చనిపోతున్నారు. అనారోగ్యం, ఎక్కువ వ్యాయామం, రన్నింగ్ చేయడం, ఒత్తిడికి గురి కావడం ఇలా ఎన్నో కారణాల వల్ల హార్ట్ ఎటాక్ కి గురైతున్నారు. లారీ నడుపుతున్న డ్రైవర్ కి గుండెపోటు రావడంతో సమయస్ఫూర్తితో ఓ నిర్ణయం తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..

టైల్స్ లోడ్ తో విజయనగరం వెళ్తున్న లారీ కొంతదూరంలోనే పక్కకు ఆగిపోయింది. కారణం డ్రైవింగ్ చేస్తున్న సమయంలో డ్రైవర్ కి గుండెపోటు రావడంతో వెంటనే అప్రమత్తమైన సమయస్పూర్తి ప్రదర్శించి లారీని పక్కకు తీసి ఆపాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. కానీ లారీ డ్రైవర్ మాత్రం స్టీరింగ్ పైనే కుప్పకూలిపోయాడు. అది గమనించిన క్లీనర్ వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ జిల్లా కుంటముక్కల గ్రామానికి చెందిన సాహు గోపీ (55) లాడీ డ్రైవర్ గా కొనసాగుతున్నాడు.ఈ క్రమంలోనే విజయనగరం టైల్స్ లోడ్ తో బయలుదేరాడు.

రాగంపేట శివారాలో నీలాద్రి రావుపేల సమీపంలో గుండెనొప్పికి గురయ్యాడు. తన వల్ల ఎవరికీ ప్రమాదం జరగకూడదని చాకచర్యంగా లారీని పక్కకు తిప్ప కుప్పకూలిపోయాడు. వెంటనే క్లీన్ గోపీని దగ్గరలోని హాస్పిటల్ కి తీసుకొని వెళ్లాడు. అక్కడ వైద్యులు సాహు గోపీని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో క్లీనర్ పోలీసులకు , బంధువులకు సమాచారం అందించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి