P Krishna
P Krishna
ఇటీవల చాలా మంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురైతున్నారు. ఆ సమయంలో క్షణికావేశానికి లోనై ఎదుటి వారిపై దాడులు చేయడం… హత్యలు చేయడం లాంటివి చేస్తున్నారు. మరికొంతమంది ఆత్మహత్యలకు పాల్పపలుతున్నారు. వివాహేతర సంబంధాలు, ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడి ఇలా ఎన్నో కారణాల వల్ల నిండు ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. తన స్నేహితుడు చనిపోవడం తట్టుకోలేక అతని ప్రాణ స్నేహితుడు బలవన్మరణానికి పాల్పపడ్డాడు. ఈ విషాద ఘటన శ్రీరాంపూర్ లో చోటు చేసుకుంది.
శ్రీరాంపూర్ ఆర్కే కాలనీలో నివాసం ఉంటున్న నందినేని మోహన్ (30) అదే కాలనీకి చెందిన అఖిల్ చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసి వెళ్లేవారు. ఒకరినొకరు విడిచి ఉండేవాళ్లు కాదు.. వీరి స్నేహం బంధం చూసి అందరూ మెచ్చుకునేవారు. ఇటీవల అఖిల్ కి మంచిర్యాలకు చెందిన ఓ యువతితో వివాహం జరిగింది. పెళ్లైనా కూడా ఇద్దరు స్నేహితులు కలిసి ఉండేవాళ్లు. ఈ విషయం అఖిల్ భార్యకు నచ్చలేదు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో అఖిల్ భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది.
తన భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్థాపానికి గురైన అఖిల్ జీవితంపై విరక్తి చెంది సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. తన స్నేహితుడు చనిపోవడంతో డిప్రేషన్ లోకి వెళ్లిపోయాడు మోహన్. తన ప్రాణానికి ప్రాణమైన స్నేహితుడు అఖిల్ మరణం తట్టుకోలేకపోయాడు. కుటుంబ సభ్యులతో చెప్పి సోమవారం గోదావరి నదిలో దూకి బలవన్మరాణానికి పాల్పపడ్డాడు.
మొదట పోలీసులు మిస్సింగ్ కేసు గా నమోదు చేసుకున్నారు. మోహన్ బైక్ గోదావరి నది ఒడ్డున ఉండటంతో సెల్ ఫోన్ సిగ్నల్ తో గజ ఈతగాళ్లను తీసుకు వచ్చి గాలించారు. సోమవారం రాత్రి గోదావరి నదిలో దూకిన మోహన్ మృతదేహం గురువారం లభ్యమైంది. ఇద్దరు ప్రాణ స్నేహితులు కన్నుమూయడంతో శ్రీరాంపూర్ లో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నారు