iDreamPost

కొంప ముంచిన చిట్టీల వ్యాపారం! పండంటి సంసారం ఒక్కసారిగా..

నేటికాలంలో అప్పుల కారణంగా జరుగుతున్న ఆత్మహత్య ఘటనలు అందరిలో ఆందోళన కలిగిస్తున్నాయి. అప్పుల బాధలకు తాళలేక... కొందరు చావే పరిష్కారంగా భావిస్తున్నారు. తాజాగా విజయవాడలో అలాంటి ఘోరం ఒకటి చోటుచేసుకుంది.

నేటికాలంలో అప్పుల కారణంగా జరుగుతున్న ఆత్మహత్య ఘటనలు అందరిలో ఆందోళన కలిగిస్తున్నాయి. అప్పుల బాధలకు తాళలేక... కొందరు చావే పరిష్కారంగా భావిస్తున్నారు. తాజాగా విజయవాడలో అలాంటి ఘోరం ఒకటి చోటుచేసుకుంది.

కొంప ముంచిన చిట్టీల వ్యాపారం! పండంటి సంసారం ఒక్కసారిగా..

ప్రతి ఒక్కరికీ జీవితంలో మంచి స్థితిలో ఉండాలనే కోరిక ఉంటుంది. ఎక్కువ డబ్బు సంపాదించాలనే కోరికతో రేయింబవళ్లు కష్టపడుతుంటారు. మరికొందరు షార్ట్ కర్ట్ లో త్వరగా ధనవంతులం కావాలనే ఆశతో ఉంటారు. అందుకే వివిధ రకాల వ్యాపారాలు,  చిట్టీల వ్యాపారం, జూదాలు  కాస్తుంటారు. ఈక్రమంలోనే  భారీగా అప్పులు చేసి.. ఆర్థికంగా చితికిపోయే వారు చాలా మంది ఉన్నారు. ఇక చేసిన తప్పులు తీర్చలేక, అప్పు ఇచ్చిన వారికి సమాధానం చెప్పలేక.. దారుణమైన నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా ఓ దంపతులు కూడా అప్పుల బాధతో ఆత్మహత్యయత్నం చేశారు. ఈ ఘటన భార్య మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది.  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని శాంతినగర్ లో ప్రతాప్ కుమార్, సాయికన్య అనే దంపతులు ఉంటున్నారు. ఈ దంపతులకు ఇద్దరు  పిల్లలు ఉన్నారు. వీరి స్థానికంగా ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అలానే ఈ దంపతులు చిట్టీల వ్యాపారం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోని చిట్టీల వ్యాపారంతో రూ.20 లక్షల అప్పు అయింది. అవి ఎలా తీర్చాలో వారికి అర్థం కాలేదు. అలానే అప్పు ఇచ్చిన వాళ్లు కూడా డబ్బులు అడుగుతుండటంతో ఈ దంపతులు ఆందోళనకు గురయ్యారని తెలుస్తోంది.

అప్పులు తీర్చే మార్గం తెలియక కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలని ప్రతాప్ కుమార్ దంపతులు భావించారు. మంగళవారం సాయంత్రం పురుగులు మందును కొనుగోలు చేసి..ఇంటికి  చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆరెంజ్  జ్యూస్ తో పాటు నాలుగు గ్లాసులో పురుగులు మందు కలుపుకున్నారు. ఇక వారిద్దరు తాగే ముందు పిల్లలను చంపడానికి ఆ దంపతుల మనస్సు ఒప్పుకోలేదు. అందుకే ప్రతాప్ కుమార్, సాయికన్య మాత్రమే విషయం తీసుకున్నారు. ఇక సాయికన్య తీసుకున్న గ్లాసులో పురుగుల మందు ఎక్కువ మోతాదులో కలవడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఇంట్లో తల్లిదండ్రులు గిలగిల కొట్టుకోవడం గమనించిన పిల్లలిద్దరు.. బయటకు వెళ్లి కేకలు వేశారు.

పిల్లలు స్థానికులకి జరిగిన విషయం చెప్పడంతో వారు ఇంట్లోకి వచ్చి చూశారు. అప్పటికే  సాయి కన్య మృతి చెందగా.. ప్రతాప్ ప్రాణాలతో కొట్టమిట్టాడుతున్నాడు. అతడిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై అనుమానస్పద కేసుగా పోలీసులు నమోదు చేశారు. ఈ తరహా ఘటనలు నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. అప్పుల బాధతో, లోన్ యాప్ వేధింపుల కారణంగా ఎందరో ఆత్మహత్య చేసుకుంటున్నారు.  ఏది ఏమైనప్పటికి తొందర పాటు నిర్ణయాలు కుటుంబాలను చీకట్లోకి నెట్టేస్తున్నాయని చాలా మంది అభిప్రాయా పడుతున్నారు. మరి.. ఇలా ఆత్మహత్య చేసుకుని బిడ్డలను అనాథలుగా చేయడంపై అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి