iDreamPost

ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ కిందకు దూసుకెళ్లిన కారు!

మరణం అనేది ఎప్పుడు సంభవిస్తుందో ఎవరం చెప్పలేము. అయితే కొన్ని సార్లు విధి రాతగా మృత్యువు వెంటాడుతుంది. మరికొన్ని సందర్భాల్లో మాత్రం మృత్యువును మనమే పిలిచినట్లుగా కొన్ని తప్పులు చేస్తుంటాము. తాజాగా సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదమే నిదర్శనం.

మరణం అనేది ఎప్పుడు సంభవిస్తుందో ఎవరం చెప్పలేము. అయితే కొన్ని సార్లు విధి రాతగా మృత్యువు వెంటాడుతుంది. మరికొన్ని సందర్భాల్లో మాత్రం మృత్యువును మనమే పిలిచినట్లుగా కొన్ని తప్పులు చేస్తుంటాము. తాజాగా సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదమే నిదర్శనం.

ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ కిందకు దూసుకెళ్లిన కారు!

ఇటీవల కాలంలో రోడ్లపై జరిగే ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. నిత్యం ఏదో ఒక ప్రాంతలో రోడ్డు యాక్సిడెంట్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అతివేగం, నిద్రమత్తు, మద్యం మత్తు, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి కారణాలతో ఈ ఘోర ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలా కొందరి నిర్లక్ష్యానికి ఎందరో అమాయకులు బలైపోతున్నారు. ఇటీవలే మధ్యప్రదేశ్ లో ఎన్నికల సిబ్బంది వెళ్తున్న బస్సు లోయలో బోల్తా పడింది. ఈ ఘటనలో 21 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రం సూర్యపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.  ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న ఓ కంటైనర్ లారీని కారు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ సంఘటనలో అక్కడిక్కడే ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలిం చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

రోడ్డుప్ర‌మాదానికి గురైన కారు నంబ‌ర్ టీఎస్ 04ఎఫ్ఏ 6894గా పోలీసులు గుర్తించారు. కారులో ప్ర‌యాణిస్తున్న వారు నిద్ర మ‌త్తులో ఉండ‌డ‌మే ప్ర‌మాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. అలానే ఆగి ఉన్న లారీ సిగ్నల్ వేయకుండా వాహనం నిలపడంతో ఈ ప్రమాదం జరిగిందా అనే కోణం కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. అలానే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం కూడా అందాల్సి ఉంది. అయితే ప్రమాదాన్ని చూసినట్లు వేగంగా కారు లారీని ఢీ కొట్టింది. అంతేకాక లారీ భారీ బరువుతో ఉండటంతో కారు..దానికి కిందకు పూర్తిగా దూరిపోయింది. ఇక  రోడ్డుపై సిగ్నల్ వేయకుండా వాహనాలు ఆపొద్దని రవాణాశాఖ అధికారులు వాహదారులను హెచ్చరిస్తున్నారు. అయినా కూడా కొందరు ఆవేమి పట్టించుకోకపోవడంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

ఇటీవలే తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఓ కారు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. వేగంగా వచ్చిన కారు..బైక్ ను ఢీకొట్టి ఫల్టీలు కొట్టింది.  ఈఘటనలో కారులోని ఐదుగురు, బైక్ పై ఉన్న వ్యక్తి..  అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, అతివేగంగా వాహనం నడపడం వంటివే ఈ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం. మరి.. ఇలాంటి ఘటనల నివారణకు చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి