iDreamPost
android-app
ios-app

వీడియో: బైక్ ను ఢీకొని.. కాలువలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు!

వీడియో: బైక్ ను ఢీకొని.. కాలువలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు!

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడపడం, మద్యం తాగి డ్రైవింగ్ చేయండ వంటి కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇక ఈ ప్రమాదాల్లో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటారు. మరెందరో  తీవ్ర గాయాలతో  జీవితాన్ని నరకంగా అనుభవిస్తున్నారు. తాజాగా జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో  ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

జిగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జగిత్యాల నుంచి వస్తున్న ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ బస్సు.. వెంకటాపూర్ స్టేజ్ వద్దకు వచ్చింది. ఇదే సమయంలో అటుగా ఇద్దరు వ్యక్తులు బైక్ పై వస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు, ఆ ద్విచక్ర వాహనం ఢీకొట్టుకున్నాయి. అనంతరం బస్సు రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు భయందోళనకు గురయ్యారు.పెద్ద ఎత్తున కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అలానే బస్సులోని ప్రయాణికులు అత్యవసర విండోను పగలగొట్టి.. బయటకు దూకేశారు.

అయితే ఈ ప్రమాదంలో బైక్ ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని సమీపంలోనే ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. అయితే  వారి పరిస్థితి విషయమంగా ఉంది. రోడ్డు పక్కకు దూసుకెళ్లిన బస్సులోని పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి సీసీ పుటేజ్ ఒకటి బయటకు వచ్చింది. ఆ వీడియోలో చూసినట్లయితే.. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు.. రాంగ్ రూట్లో రోడ్డు దాటే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో వారికి ఎదురుగా ఆర్టీసీ బస్సు వచ్చి..క్షణాల్లో ఢీ కొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషళ్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఇదీ చదవండి: పెళ్లికాని కుర్రాడితో మహిళ ఎంజాయ్! అన్నీ చేసి చివరికి..!

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetcratosroyalbetcasibomcasibomcasibombetcio giriş