iDreamPost
android-app
ios-app

పెళ్లైన గంటలోనే నవ వధువు మృతి.. కారణం ఏంటంటే!

  • Published Mar 30, 2024 | 9:23 PM Updated Updated Mar 30, 2024 | 9:23 PM

ఈ మధ్య వివాహమహోత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. నూతన వధూవరులు తమకు ఇష్టమైన రీతిలతో చాలా వెరైటీగా పెళ్లి వేడుకలు జరిపించుకుంటున్నారు. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ మొదలు పెళ్లయ్యే వరకు అంతా గ్రాండ్ లుక్ తో ఉండాలని చూస్తున్నారు.న

ఈ మధ్య వివాహమహోత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. నూతన వధూవరులు తమకు ఇష్టమైన రీతిలతో చాలా వెరైటీగా పెళ్లి వేడుకలు జరిపించుకుంటున్నారు. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ మొదలు పెళ్లయ్యే వరకు అంతా గ్రాండ్ లుక్ తో ఉండాలని చూస్తున్నారు.న

పెళ్లైన గంటలోనే నవ వధువు మృతి.. కారణం ఏంటంటే!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది.  గ్రామాలు, పట్టణాల్లో పెళ్లి మండపాలు అన్నీ బిజీగా మారిపోయాయి.  పెళ్లంటే ఇరు కుటుంబ పెద్దలు, బంధు మిత్రులతో పెళ్లి మండపం ఎంతో కోలాహలంగా ఉంటుంది. ఇక  వివాహబంధంతో ఒక్కటయ్యే జంట ఎన్నో కలలు కంటారు. పెళ్లయ్యాక భర్తతో అందమైన జీవితాన్ని గడపాలని పెళ్లి కూతురు ఎన్నో కలలు కంటుంది. ఇదిలా ఉంటే  ఇటీవల పెళ్లి వేడుకల్లో అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. అలాంటి ఘటనే ఏపీలో చోటు చేసుకుంది. పెళ్లైన గంట వ్యవధిలోనే నవ వధువు కన్నుమూయడం అందరి హృదయాలను కలచి వేసింది. వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లా దబ్బగడ్డ గ్రామంలో పెళ్లింట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పార్వతీపురం కు చెందిన వెత్స అఖిలకు, దెబ్బగడ్డ గ్రామానికి చెందిన భాస్కర్ రావు తో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో అంగరంగ వైభవంగా పెళ్లైంది. వివాహానికి వచ్చిన ఇరు కుటుంబాల పెద్దలు, బంధువులు, స్నేహితులతో పెళ్లి మండపం ఎంతో కోలాహలంగా మారింది. పాటలు, డ్యాన్సులతో అంతా అక్కడి వాతావరణం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది. అయితే  అర్ధరాత్రి వరకు సాగిన పెళ్లి తంతు ముగిసిన తర్వాత తనకు కళ్లు తిరుగుతున్నాయని.. నీరసంగా ఉందని చెప్పి నిద్రలోకి జారుకుంది.

కుటుంబ సభ్యులు ఎంత లేపినా లేవకపోవడంతో అనుమానం వచ్చి వెంటనే మక్కువ పీహెచ్ సీకి తరలించారు. అప్పటికే అఖిల పరిస్థితి క్షీణించడంతో వెంటనే సాలూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అఖిల మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ విషయం తెలిసి పెళ్లికి వచ్చిన బంధువులు ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగిపోయారు. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న తమ కూతురు గంటల వ్యవధిలోనే  కానరాని లోకానికి వెళ్లడంతో అఖిల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అఖిల మృతి విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన విషయాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişRoyalbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetcasibomMadridbetHoliganbet GirişGrandpashabet Giriş