iDreamPost

సెమినార్ కు వెళ్లిన వైద్య విద్యార్థిని..స్నేహితుల కళ్ల ముందే..

సెమినార్ కు వెళ్లిన వైద్య విద్యార్థిని..స్నేహితుల కళ్ల ముందే..

తల్లిదండ్రులు తమ బిడ్డలపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. బిడ్డలు ఉన్నత స్థితికి చేరుకోవాలని ఎన్నో కలలు కంటారు. అందరిలానే ఓ దంపతులు కూడ తమ బిడ్డ జీవితం గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వైద్య విద్య చదువుతున్న తమ కుమార్తె.. మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయి డాక్టర్ గా మారి.. సేవలందిస్తుందనుకున్నారు. కానీ.. విధి ఆడిన వింత నాటకంలో వారి కలలు కన్నీరుగా మారాయి. వైద్యురాలుగా కనిపిస్తుందనుకున్న తమ కుమార్తె విగత జీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషాధ ఘటన కాకినాడలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

విజయవాడ మారుతీ నగర్ వీరయ్య వీధికి చెందిన శ్రీనివాస్ మోహన్, సురేఖ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు ఉజ్వలకు ఈ ఏడాది మార్చిలో వివాహం జరిగింది.  ఇక చిన్న కుమార్తె సత్య తనూష(24) గుంటూరు జిల్లా చినకాకానిలోని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతోంది. తమ బిడ్డ మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయి వైద్యురాలిగా మారి సేవలందిస్తున్న తనూష తల్లిదండ్రులు కలలు కన్నారు. ఈ క్రమంలోనే కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో గురువారం నుంచి మూడు రోజుల పాటు మెడికల్ సదస్సు జరగనున్నాయి.  ఈ సదస్సులో పాల్గొనేందుకు తనూష్.. మరో ఇద్దరి స్నేహితులతో కలిసి శేషాద్రి ఎక్స్ ప్రెస్ లో కాకినాడకు బయలు దేరింది.

ఇక స్టేషన్ చేరుకున్న తనూష.. రెండో నంబర్ ప్లాట్ ఫామ్ పై  రైలు దిగేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో పట్టు తప్పి ప్లాట్ ఫామ్ కు రైలుకు మధ్యలో పడిపోయింది. అంతలోనే రైలు కూడా కదిలింది. తనూష పడిపోవడం గమనించిన స్నేహితులు,  తోటి ప్రయాణికులు గట్టిగా కేకలు వవేసి, చైన్ లాగారు. అయితే అప్పటికే తనూష ప్లాట్ ఫామ్, రైలు చక్రాల మధ్య నలిగిపోయింది. తీవ్ర గాయాలతో  అక్కడికక్కడే మృతి చెందింది. తమ కాలేజి విద్యార్థి ఆకస్మిక మరణంతో రంగరాయ మెడికల్ కాలేజీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తనూష మృతదేహం చూసి.. ఆమె స్నేహితులు షాకి గురయ్యారు. ఇక విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధించారు.

ఇదీ చదవండి: తండ్రిని చంపాలని చూసిన కూతురు!ఎందుకో తెలుసా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి