iDreamPost

బంగారం కొనాలనుకుంటున్నారా.. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు.. త్వరపడండి

  • Published Aug 12, 2023 | 8:37 AMUpdated Aug 12, 2023 | 9:22 AM
  • Published Aug 12, 2023 | 8:37 AMUpdated Aug 12, 2023 | 9:22 AM
బంగారం కొనాలనుకుంటున్నారా.. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు.. త్వరపడండి

భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గోల్డ్‌ అంటే మనకు కేవలం ఆభరణం మాత్రమే కాక.. శుభప్రదం, లక్ష్మిదేవి ప్రతి రూపంగా భావిస్తారు. సందర్భం వచ్చిన ప్రతి సారి ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇక వివాహాది శుభకార్యల సందర్భంగా మన దగ్గర బంగారం కొనుగోళ్లు భారీగా ఉంటాయి. అయితే పెరుగుతున్న బంగారం ధరలు చూసి.. పుత్తడి కొనాలంటేనే సామాన్యులు భయపడతున్నారు. మరి మీరు కూడా గోల్డ్‌ కొనాలని భావించినప్పటికి.. పెరుగుతున్న ధర చూసి ఆగిపోయారా.. అయితే మీకు ఇది భారీ గుడ్‌ న్యూస్‌ అన్నమాటే. గత మూడు రోజులుగా దిగి వస్తోన్న బంగారం ధర.. నేడు కూడా పడిపోయింది. వరుసగా నాలుగు రోజులుగా పసిడి ధర దిగి వస్తుండటంతో.. బంగారం కొనాలనుకునే వారికి.. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు.. ఇప్పుడే త్వరపడండి అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. మరి నేడు బంగారం ధర ఎంత దిగి వచ్చింది అంటే..

ఇక నేడు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర మరోసారి పడిపోయింది. నేడు భాగ్యనగరంలో 22 క్యారెట్‌ గోల్డ్‌ రేటు 10 గ్రాముల మీద రూ. 150 తగ్గి రూ. 54,550 వద్ద ట్రేడవుతోంది. ఇక గత నాలుగు రోజుల్లో చూస్తే 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 600 మేర దిగి వచ్చింది. ఇక 24 క్యారెట్‌ గోల్డ్‌ రేటు కూడా 10 గ్రాముల మీద రూ. 160 పతనమై ప్రస్తుతం రూ.59,510 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా నేడు బంగారం ధర దిగి వచ్చింది. హస్తినలో నేడు 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర రూ. 150 పడియి రూ. 54,700 వద్ద ఉంది. అలానే 24 క్యారెట్‌ పసిడి పది గ్రాముల రేటు రూ.160 తగ్గి రూ.59,660 వద్ద ట్రేడవుతోంది. గత నాలుగు రోజుల్లో ఇక్కడ 10 గ్రాముల బంగారం ధర రూ. 650 మేర పతనమైంది.

స్థిరంగా వెండి ధర..

బంగారం ధర వరుసగా నాలుగో రోజు తగ్గినా.. వెండి రేట్లు మాత్రం స్థిరంగా ఉన్నాయి. నేడు ఢిల్లీలో కిలో వెండి రేటు రూ. 73 వేల వద్ద ఉంది. ఇక హైదరాబాద్‌లో కూడా వెండి ధర స్థిరంగానే ఉన్నాయి. ఇక్కడ కిలోకు రూ. 76,200 పలుకుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1913 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయంలో స్పాట్ సిల్వర్ రేటు చూస్తే 22.70 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి