iDreamPost

గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు! నేడు ఎంతంటే?

Gold and Silver Rates: ఇటీవల దేశంలో పసిడి కొనుగోలు బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు మహిళలు ఎక్కువగా బంగారం, వెండి కొనుగోలు చేస్తున్నారు.

Gold and Silver Rates: ఇటీవల దేశంలో పసిడి కొనుగోలు బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు మహిళలు ఎక్కువగా బంగారం, వెండి కొనుగోలు చేస్తున్నారు.

గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు! నేడు ఎంతంటే?

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఊరటనిచ్చే శుభవార్త. ఇటీవల రికార్డు స్థాయిలో పెరిగిపోయిన బంగారం ధరలు గత పదిరోజుల నుంచి కాస్త తగ్గుముఖం పట్టాయి. కొన్నిరోజులు స్థిరంగా కొనసాగుతూ వస్తున్నాయి. జనవరి, ఫిబ్రవరి నేలలో గరిష్టంగా తగ్గిన బంగారం మార్చి నెలలో ఏకంగా వెయ్యి రూపాయల వరకు మళ్లీ పుంజుకుంది. గత వారం రోజుల నుంచి తగ్గుతూ వస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. నేడు బంగారం, వెండి ధరల ఎలా ఉన్నాయో చూద్దాం. వివరాల్లోకి వెళితే..

ప్రపంచంలో బంగారం అంటే ప్రతి ఒక్కరూ ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పన్కరలేదు. బంగారంతో ఎన్నో రకాల ఆభరణాలు డిజైన్ చేయబడతాయి.. వాటిని ధరంచేందుకు మహిళలు తెగ ముచ్చటపడతారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో మహిళలు జ్యులరీ షాపులకు క్యూ కడుతున్నారు. మార్చి నెల మొదటి రెండు వారాలు బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. గత వారం రోజుల నుంచి పసిడి, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ సమయంలో బంగారం, వెండి కొనుగోలు చేస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ లో నేటి గోల్డ్ రేటు ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,140 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,700 వద్ద కొనసాగుతుంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.80,400 వద్ద కొనసాగుతుంది.

A relief for the lovers of Gold

ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.61,290 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,860 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగుళూరు, కోల్‌కొతా, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.61,140లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.66,710 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,630 వద్ద కొనసాగుతుంది. బెంగుళూరు లో కిలో వెండి ధర రూ.76,600, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ.77,400 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నై కిలో వెండి ధర రూ. 80,400 లు ఉండగా, ఢిల్లీ లో రూ.77,400 వద్ద ట్రెండ్ అవుతుంది. రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు ఉండబోతాయో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి