iDreamPost

స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?

Gold and Silver Rates: ఇటీవల బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. వేసవి కాలం కావడంతో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది.. మహిళలు ఎక్కువగా పసిడి కొనుగోలు చేస్తుంటారు.

Gold and Silver Rates: ఇటీవల బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. వేసవి కాలం కావడంతో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది.. మహిళలు ఎక్కువగా పసిడి కొనుగోలు చేస్తుంటారు.

స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?

ఈ మద్య బంగారం ధరలు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్ నాటికి పసిడి ధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసంలో తగ్గుముఖం పట్టాయి. కానీ మార్చి నెలలో మళ్లీ పసిడి, వెండి ధరలు పుంజుకున్నాయి. ప్రపంచంలో బంగారం ఎంత విలువైందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. అందుకే దీనికి డిమాండ్ రోజు రోజుకీ పెరిగిపోతుంది. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. వివరాల్లోకి వెళితే..

వేసవి కాలం వచ్చేసింది.. దేశ వ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ మొదలైంది.  ఈ సమయంలో మహిళలలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటారు. కానీ ఇటీవల పసిడి ధరలు పెరిగిపోవడంతో కొనుగోలు చేయాలంటే బెంబేలెత్తిపోతున్నారు. గత నెలతో పోల్చుకుంటే ఈ నెల బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ లో నేటి గోల్డ్ రేటు ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.61,810 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,430 వద్ద కొనసాగుతుంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.81,600 వద్ద కొనసాగుతుంది.

ఇక ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 61,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,570 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగుళూరు, కోల్‌కొతా, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.61,810 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.67,430 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,030 వద్ద కొనసాగుతుంది. బెంగుళూరు లో కిలో వెండి ధర రూ.76,100, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ.78,600 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నై కిలో వెండి ధర రూ. 81,600లు ఉండగా, ఢిల్లీ లో రూ.78,500 వద్ద ట్రెండ్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి