iDreamPost
android-app
ios-app

పసిడి కొనుగోలుదారులకు బిగ్‌షాక్‌.. ఈ రోజు ధర ఎంతంటే?

Gold and Silver Rates: గత ఏడాది బంగారం భారీగా పెరిగిపోయింది.. ఈ ఏడాది చాలా వరకు పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ మొదలు అయ్యింది.. దీంతో పసిడి ధరల్లో మళ్లీ మార్పులు వస్తున్నాయి.

Gold and Silver Rates: గత ఏడాది బంగారం భారీగా పెరిగిపోయింది.. ఈ ఏడాది చాలా వరకు పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ మొదలు అయ్యింది.. దీంతో పసిడి ధరల్లో మళ్లీ మార్పులు వస్తున్నాయి.

పసిడి కొనుగోలుదారులకు బిగ్‌షాక్‌.. ఈ రోజు ధర ఎంతంటే?

ప్రపంచంలో గోల్డ్ కి ఎంత విలువ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. భారత దేశంలో బంగారం కొనుగోలు బాగా పెరిగిపోయింది. జ్యూలరీ షాపుల్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెరైటీ ఆభరణాలు రావడంతో మహిళలు వాటిని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో పసిడికి విపరీతమైన డిమాండ్ పెరిగిపోతుంది. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న పరిణామాలు బంగారం, వెండిపై ప్రభావం చూపిస్తున్నాయని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.ఈ క్రమంలోనే పసిడి, వెండి తరుచూ పెరుగుతూ.. తగ్గుతూ వస్తుంది. గత నెల బంగారం ధరలు భారీగా తగ్గిపోయాయి.. తాజాగా మళ్లీ షాక్ ఇస్తున్నాయి. శనివారం మార్కెట్ లో బంగారం, వెండి ధరల విషయానికి వస్తే..

వేసవి కాలంల వచ్చిందంటే పెళ్లిళ్ల  మొదలైనట్టే. ఈ సీజన్ లో మహిళలు ఎక్కువగా బంగారం, వెండి కొనుగోలు చేస్తుంటారు. ఫిబ్రవరి నెలలో పసిడి ధరలు చాలా వరకు తగ్గాయి. వరుసగా పడిపోతూ వచ్చిన పసిడి ధరలు ఒక్కసారే పెరిగాయి. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా పసిడి ధర పెరగడం గమనార్హం. దేశీయంగా, అంతర్జాతీయంగా పసిడి, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ లో నేటి గోల్డ్ రేటు ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 57,910 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.63,170 వద్ద కొనసాగుతుంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.76,300 వద్ద ట్రెండ్ అవుతుంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 58,060 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.63,320వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగుళూరు,కోల్‌కొతా, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.57,910 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.63,170 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.58,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.63,720 వద్ద కొనసాగుతుంది. బెంగుళూరు లో కిలో వెండి ధర రూ. 72,100, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ.74,600వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నై కిలో వెండి ధర రూ. 76,200 లు ఉండగా, ఢిల్లీ లో రూ.74,500 వద్ద ట్రెండ్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి