iDreamPost

స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే?

గత రెండు నెలలు పసిడి ధరలు చుక్కలు చూపించాయి.. 24 క్యారెట్ బంగారం ధర ఏకంగా రూ.64 వేల వరకు వెళ్లింది. కొత్త ఏడాది బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో మహిళలు జ్యులరీ షాపులకు క్యూ కడుతున్నారు.

గత రెండు నెలలు పసిడి ధరలు చుక్కలు చూపించాయి.. 24 క్యారెట్ బంగారం ధర ఏకంగా రూ.64 వేల వరకు వెళ్లింది. కొత్త ఏడాది బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో మహిళలు జ్యులరీ షాపులకు క్యూ కడుతున్నారు.

స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే?

దేశంలో బంగారం అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు.. అందుకే జ్యులరీ షాపుల్లో ఎప్పటికప్పుడు వెరైటీ ఆభరణాలు తయారు చేస్తుంటారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు ఎక్కువగా బంగా ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. గత రెండు నెలలుగా బంగారం ధరలు గరిష్ట స్థాయికి పెరిగిపోయాయి. అయితే వారం రోజుల నుంచి మాత్రం పసిడి ధరల రోజు రోజుకీ తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో వస్తున్న మార్పుల కారణంగా బంగారం ధరల్లో తరుచూ మార్పులు వస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. నిన్న బంగారం ధరలు కాస్త పెరిగినప్పటికీ.. నేడు స్థిరంగానే కొనసాగుతున్నాయి. నేడు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

గత రెండు నెలల నుంచి బంగారం ధరలు చుక్కులు చూపించాయి. 24 క్యారెట్ బంగారం ధర రూ.64 వేలు దాటింది. కొత్త ఏడాది పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి.  నిన్నటితో పోల్చుకుంటే.. ఈ రోజు మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేకుండా స్థిరాంగా కొనసాగుతున్నాయి. పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అంటున్నారు నిపుణులు.  ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,270కి చేరింది. ఇక కిలో వెండి ధర రూ. 78,000 వద్ద కొనసాగుతుంది.

today gold rates

దేశంలోని ప్రధాన నగరాలు అయిన ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,150 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ..63,420 వద్ద కొనసాగుతుంది. ముంబై, బెంగుళూరు, కోల్‌కొతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.58,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,270 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.58,600 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.63,930 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ.76,600 కు చేరింది. బెంగుళూరులో రూ. 74,000 ఉండగా, చెన్నైలో కిలో వెండి ధర రూ. 78,000 వద్ద ట్రెండ్ అవుతుంది. ధరలు తగ్గినపుడు బంగారం కొనుగోలు చేస్తే మంచిదని కొనుగోలుదారులు భావిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి