iDreamPost

Gold and Silver Rates: పరుగులు పెడుతున్న బంగారం.. ఈ రోజు ధర ఎంతంటే!

ప్రపంచంలో బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు. మార్కెట్ లో బంగారానికి ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంది.. దీంతో దీని ధరల్లో ప్రతిసారి హెచ్చుతగ్గులు అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో పసిడి ధర రూ.60 వేలు దాటిపోయింది.

ప్రపంచంలో బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు. మార్కెట్ లో బంగారానికి ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంది.. దీంతో దీని ధరల్లో ప్రతిసారి హెచ్చుతగ్గులు అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో పసిడి ధర రూ.60 వేలు దాటిపోయింది.

Gold and Silver Rates: పరుగులు పెడుతున్న బంగారం.. ఈ రోజు ధర ఎంతంటే!

దేశంలో పసిడి అంటే ఆడవాళ్లే కాదు మగవారు కూడా ఎంతగానో ఇష్టపడుతుంటారు. ఎన్నో రకాల వెరైటీ ఆభరణాలు తయారు చేస్తుంటారు.. వాటిని కొనుగోలు చేయడానికి మహిళలు జ్యులరీ షాపులకు క్యూ కడుతుంటారు. గత కొంతకాలంగా బంగారం ధరలు తరుచూ హెచ్చుతగ్గులవుతున్నాయి. సెప్టెంబర్ లో అనూహ్యంగా తగ్గిపోయిన బంగారం అక్టోబర్ నెల నుంచి అమాంతం పెరిగిపోయాయి. ఈ నెలలో బంగారం కొన్ని రోజులు స్థిరంగా ఉన్నా.. మళ్లీ చుక్కలు చూపిస్తుంది. గత వారం రోజుల్లోనే తులం బంగారంపై ఏకంగా రూ.1000 మేర పెరిగిపోయింది. వెండి ధరలు కూడా అదే రేంజ్ లో పెరిగిపోయాయి. నేడు మార్కెట్ లో బంగారం ధరల విషయానికి వస్తే…

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుంది. ఇదే సమయంలో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. వారం రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో పలు మార్పుల కారణంగా పసిడి ధరలపై విపరీతమైన ప్రభావం చూపిస్తున్నాయని అంటున్నారు ఆర్థిక నిపుణులు. గత నెలలో గరిష్ట స్థాయికి పెరగడంతో కొనుగోలుదారులు బెంబేలుపడ్డారు. పెళ్లిళ్ళ సమయానికి బంగారం మరోసారి చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే ఇక బంగారం బాటలోనే వెండి కూడా నడుస్తుంది. నేడు దేశీయ మార్కెట్ లో గోల్డ్ ధరలు చూస్తే.. హైదరాబాద్, విశాఖ, విజయవాడ, వరంగల్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.63,490 వద్ద ట్రెండ్ అవుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర విషయానికి వస్తే.. కిలో రూ..80,500 వద్ద ట్రెండ్ అవుతుంది.

gold rates increased

దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. ముంబై, బెంగళూరు, కోలకతా లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.58,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.63,490 వద్ద ట్రెండ్ అవుతుంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసడి ధర రూ. 58,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.63,640 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 10 గ్రాములు 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,750 గా ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 64,090 వద్ద ట్రెండ్ అవుతుంది. దేశంలోని ప్రధాన నగరాలు ఢిల్లీ, కోల్‌కొతా కిలో వెండి ధర రూ.79,000, ముంబై లో వెండి ధర రూ. 78,500 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.79,000, బెంగుళూరులో రూ. 76,750 వద్ద ట్రెండ్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి