iDreamPost
android-app
ios-app

పసిడి ప్రియులకు ఊరట.. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే?

ఇటీవల మార్కెట్ లో బంగారం క్రమంగా తగ్గుతూ.. పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది.. దీంతో మహిళలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి జువెలరీ షాపులకు క్యూ కడుతున్నారు.

ఇటీవల మార్కెట్ లో బంగారం క్రమంగా తగ్గుతూ.. పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది.. దీంతో మహిళలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి జువెలరీ షాపులకు క్యూ కడుతున్నారు.

పసిడి ప్రియులకు ఊరట.. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే?

బంగారం కొనుగోలు చేసేవారికి ఓ గుడ్ న్యూస్.. ప్రస్తుతం పసిడి ధరలు స్థిరంగా నమోదు అవుతున్నాయి. గత రెండు రోజులుగా పసిడి ధరలు పెరుగుతూ.. తగ్గుతూ వచ్చినప్పటికీ.. నేడు మార్కెట్ లో స్థిరంగా కొనసాగుతుంది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర తులం రూ.62 వేలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ లో ఏర్పడుతున్న మార్పులు బంగారం పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో బంగారం అత్యంత విలువైనది.. అందుకే దీనికి డిమాండ్ ఎక్కువ. భారత్ లో పసిడి వినియోగం రోజు రోజుకీ పెరిగిపోతున్న కారణంగా డిమాండ్ కూడా బాగానే పెరిగిపోయింది. నేడు మార్కెట్ లో పసిడి, వెండి ధరల విషయానికి వస్తే..

దేశంలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. దీంతో మహిళలు ఎక్కువగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. సెప్టెంబర్ లో బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టినా.. అక్టోబర్ నుంచి మల్లీ చుక్కులు చూపిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో పసిడి ధర రూ.62 వేలకు చేరింది. దాంతోపాటే వెండి ధరలు కూడా భారీగా పెరిగిపోతూ వస్తున్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్ వడ్డీ ధరల్లో స్వల్ప మార్పులు పసిడి ధరల పై పడుతున్నాయి. మొన్నటి వరకు మార్కెట్ లో బంగారం ధరలు హెచ్చుతగ్గులు అవుతూ వచ్చాయి.. నేడు మాత్రం స్థిరంగా ఉండటం కాస్త ఊరట కలిగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నేడు బంగారం ధరల ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ. 57,400 గా ఉండగా… 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 62,620 వద్ద కొనసాగుతుంది. ఇక దేశీయ మార్కెట్ లో కిలో వెండి ధర రూ.79,500 వద్ద కొనసాగుతుంది.

today gold rates

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల విషయానికి వస్తే.. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 57,400 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,620 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 57,550 గా ఉండగా.. 24 క్యారెట్ల పసడి ధర రూ. 62,770 వద్ద ట్రెండ్ అవుతుంది. బెంగళూరు, కోల్‌కతా,కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,400 గా ఉండగా, 24 క్యారెట్ల పసిడి రూ. 62,620 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 57,950గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 63,220 వద్ద కొనసాగుతుంది. ప్రధాన నగరాల్లో వెండి ధరలు.. ముంబై, పూణె, జైపూర్, కోల్ కోతా, ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 77,500 వద్ద కొనసాగుతుంది. ప్రస్తుతం స్థిరంగా ధరలు కొనసాగుతున్నాయి కనుక ఈ సమయంలో బంగారం కొనుగోలు చేయడం మంచిదని అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి