iDreamPost

పసిడి ప్రియులకు ఊరట.. నేటి బంగారం, వెండి ధరలు ఇవే

  • Published Sep 04, 2023 | 8:00 AMUpdated Sep 04, 2023 | 8:00 AM
  • Published Sep 04, 2023 | 8:00 AMUpdated Sep 04, 2023 | 8:00 AM
పసిడి ప్రియులకు ఊరట.. నేటి బంగారం, వెండి ధరలు ఇవే

బంగారం కొనాలనుకునే వారికి.. ప్రస్తుతం మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితులు చూస్తే.. బుర్ర బద్దలవుతుంది. పసడి ధర నిలకడగా ఉండటం లేదు. ఏరోజు ధర తగ్గుతుందో.. ఎప్పుడు పెరుగుతుందో అర్థం కావడం లేదు. కొన్ని రోజుల పాటు వరుసగా బంగారం ధర దిగి వస్తుండగా.. వెంటనే అందుకు రివర్స్‌లో జెట్‌ స్పీడ్‌తో పెరుగుతుంది. ఇక ఆగస్ట్‌ నెల ఆరంభం నుంచి దిగి వచ్చిన పసిడి ధర.. శ్రావణ మాసం ప్రాంరభం నుంచి భారీగా పెరుగుతోంది. క్రితం సెషన్‌లో పెరిగిన బంగారం ధర.. నేడు మాత్రం స్థిరంగా ఉంది. మరి నేడు అనగా సోమవారం దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధర ఎంత ఉంది అంటే..

నేడు ఢిల్లీ, హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర స్థిరంగా ఉంది. శ్రావణమాసం ప్రారంభం కావడంతో.. పసిడికి గిరాకీ పెరిగింది. దాంతో.. ధర కూడా భారీగానే పెరుగుతుంది. కానీ నేడు మాత్రం గోల్డ్‌ రేటు స్థిరంగా ఉంది. సోమవారం హైదరాబాద్‌లో 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర రూ. 55,200 వద్ద ట్రేడవుతోంది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ. 60,220 వద్ద అమ్ముడవుతోంది. మరోవైపు.. ఢిల్లీలో కూడా బంగారం ధర స్థిరంగా ఉంది. నేడు హస్తినలో 22 క్యారెట్‌ గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 55,350 వద్ద ఉండగా.. 24 క్యారెట్‌ మేలిమి బంగారం రేటు రూ. 60,370 వద్ద ట్రేడవుతోంది.

స్థిరంగా కొనసాగుతున్న వెండి ధర..

నేడు వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. సోమవారం.. భాగ్యనగరం బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 80 వేల మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూస్తే కిలో వెండి ధర రూ. 76,900 వద్ద ట్రేడవుతోంది. ఇక ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్ లో బంగారం ధర తక్కువగా ఉండగా.. వెండి ధర మాత్రం కాస్త ఎక్కువగానే ఉంటుంది. స్థానికంగా ఉండే పన్నులు అందుకు కారణమవుతాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి