iDreamPost

తగ్గినట్లే తగ్గి మళ్లీ షాక్‌ ఇచ్చిన బంగారం ధర.. నేడు ఎంత పెరిగిందంటే

  • Published Sep 03, 2023 | 12:02 PMUpdated Sep 03, 2023 | 12:02 PM
  • Published Sep 03, 2023 | 12:02 PMUpdated Sep 03, 2023 | 12:02 PM
తగ్గినట్లే తగ్గి మళ్లీ షాక్‌ ఇచ్చిన బంగారం ధర.. నేడు ఎంత పెరిగిందంటే

బంగారం అంటే భారతీయులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బంగారం అంటే మన దేశంలో కేవలం ఖరీదైన లోహం మాత్రమే కాక.. స్వయంగా లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తారు. మన దగ్గర గోల్డ్‌ అంటే కేవలం అలంకరణ కోసం మాత్రమే కాక.. పెట్టుబడి సాధనంగా కూడా వినియోగిస్తారు. ప్రపంచంలో బంగారం వినియోగంలో భారతదేశం ప్రధమ స్థానంలో ఉంది. కానీ మన దగ్గర బంగారం దిగుబడి తక్కువ. దాంతో మనం ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం.

ఇక మన దేశంలో బంగారానికి డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో.. ధర కూడా భారీగానే ఉంటుంది. ఇప్పటికే ఈ ఏడాది గరిష్ట స్థాయిలకు చేరుకున్న బంగారం ధర.. ఆగస్ట్‌ నెల ప్రారంభం నుంచి తగ్గుతుంది. అయితే శ్రావణమాసం ప్రారంభం నుంచి బంగారం ధర పెరుగుతూనే ఉంది. ఇక నిన్న స్వల్పంగా దిగి వచ్చిన గోల్డ రేటు.. నేడు మళ్లీ పెరిగింది. నేడు ఢిల్లీ, హైదరాబాద్‌లో బంగారం ధర ఎంత పెరిగింది అంటే..

ఇక నేడు హైదరాబాద్ మార్కెట్లో చూసుకుంటే క్రితం రోజు బంగారం ధర పడిపోగా.. నేడు మరోసారి పెరిగింది. ఇక ఆదివారం హైదరాబాద్‌ మార్కెట్‌లో నేడు 22 క్యారెట్‌ గోల్డ్‌ రేటు 10 గ్రాముల మీద రూ. 150 పెరిగి రూ. 55,200 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్‌ మేలిమి బంగారం రేటు 10 గ్రాముల మీద రూ. 170 పెరిగి రూ. 60,220 మార్క్‌ వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే 22 క్యారెట్‌ గోల్డ్ రేటు 10 గ్రాముల మీద రూ. 150 పెరిగి రూ. 55,350 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర 10 గ్రాముల మీద రూ. 170 పెరిగి రూ. 60,370 వద్దకు వద్ద ట్రేడవుతోంది

తగ్గిన వెండి ధర..

నేడు బంగారం ధర పెరిగినప్పటికీ వెండి రేటు మాత్రం వరుసగా రెండో రోజూ కూడా దిగి వచ్చింది. క్రితం సెషన్‌లో వెండి ధర కిలో మీద రూ. 500 తగ్గగా.. నేడు మరో రూ.200 దిగివచ్చింది. ఇక ఆదిఆవరం నాడు హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 200 తగ్గి రూ. 80 వేల మార్క్ వద్ద కొనసాగుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూస్తే నేడు సిల్వర్ ధర కిలో మీద రూ. 200 తగ్గి ప్రస్తుతం రూ. 76,900 మార్క్ వద్ద అమ్ముడవుతోంది.

ఇక నేడు అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1940 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఒక ఔన్సుకు 24.21 డాలర్లు వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి