iDreamPost
android-app
ios-app

బంగారం కొనేవారికి ఊరట.. నేడు తులం రేటు ఎంత ఉందంటే

  • Published Nov 27, 2023 | 8:48 AMUpdated Nov 27, 2023 | 8:48 AM

పెళ్లిళ్లు, పండగల సీజన్ సందర్భంగా బంగారానికి డిమాండ్ బాగా ఉంటుంది.. దాంతో ధర కూడా భారీగానే పెరుగుతుంది. ఇక నేడు దేశీయ బులియన్ మార్కెట్లో గోల్డ్ , సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే..

పెళ్లిళ్లు, పండగల సీజన్ సందర్భంగా బంగారానికి డిమాండ్ బాగా ఉంటుంది.. దాంతో ధర కూడా భారీగానే పెరుగుతుంది. ఇక నేడు దేశీయ బులియన్ మార్కెట్లో గోల్డ్ , సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే..

  • Published Nov 27, 2023 | 8:48 AMUpdated Nov 27, 2023 | 8:48 AM
బంగారం కొనేవారికి ఊరట.. నేడు తులం రేటు ఎంత ఉందంటే

బంగారం అంటే భారతీయులకు ఎంత ప్రీతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచలోనే ఏదేశం దగ్గర లేనంత బంగారం.. భారతీయుల వద్ద ఉంది. డిమాండ్ కు తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడంతో.. ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాము. ఇక పెళ్లిళ్లు, వివాహాల సీజన్ సందర్భంగా మన దగ్గర బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుంది. దాంతో రేటు కూడా భారీగానే పెరుగుతుంది. ఇక ఇప్పటికే మన దగ్గర గోల్డ్ రేటు ఈ ఏడాది గరిష్టాలకు చేరింది. ఇక గత కొన్ని రోజులుగా పెరుగడం తప్ప దిగిరావడం తెలియని పసిడి ధర నేడు మాత్రం స్థిరంగా ఉంది. పండుగల సీజన్ పూర్తయిన తర్వాత ధరలు దిగిరావచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి నేడు దేశీయ బులియన్ మార్కెట్ లో పుత్తడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు భాగ్యనగరంలో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాముల ధర స్థిరంగా కొనసాగుతూ.. రూ. 57,100 వద్ద కొనసాగుతోంది. అలానే 24 క్యారెట్ మేలిమి బంగారం రేటు కూడా స్థిరంగానే ఉంది. ఇక నేడు భాగ్యనగరంలో 24 క్యారెట్ పసిడి పది గ్రామలు ధర రూ. 62,290 మార్క్ వద్ద స్థిరంగా ఉంది.

అలానే దేశ రాజధాని ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. నేడు హస్తినలో 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల రేటు స్థిరంగా ఉండి రూ. 57,250 మార్క్ వద్ద ట్రేడ్ అవుతోంది. అలానే 24 క్యారెట్ స్వచ్ఛమైన గోల్డ్ ధర కూడా స్థిరంగా ఉంది. ఇక నేడు హస్తినలో 24 క్యారెట్ మేలిమి బంగారం రేటు రూ. 62,440 వద్ద అమ్ముడవుతోంది.

బంగారం బాటలోనే వెండి ధర..

నేడు బంగారం ధర స్థిరంగా ఉండగా.. వెండి రేటు అదే బాటలోనే పయనిస్తోంది. ఇక నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది. ఇక నేడు భాగ్యనరంలో కిలో వెండి ధర 80,200 రూపాయల వద్ద అమ్ముడవుతోంది. ఇక క్రితం సెషన్ లో వెండి ధర కిలో మీద రూ.1000 పెరిగిన సంగతి తెలిసిందే. ఇక నేడు హస్తినలో కూడా వెండి స్థిరంగా ఉండి.. కిలో ధర రేటు రూ. 77,200 మార్క్ వద్ద కొనసాగుతోంది.

నేడు దేశీయ బులియన్ మార్కెట్లో వెండి, బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ధరలు ఇవాళ భారీగా పడిపోయాయి. స్పాట్ గోల్డ్ రేటు ఏకంగా 20 డాలర్ల మేర పడిపోయింది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ గోల్డ్ రేటు ఔన్సుకు 20 డాలర్లు తగ్గి 2002.50 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 24.34 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి