iDreamPost

Gold&Silver Rate: బంగారం కొనుగోలుదారులకు ఊరట.. నేటి ధరలు ఇవే

  • Published Dec 26, 2023 | 8:07 AMUpdated Dec 26, 2023 | 8:07 AM

బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టాలకు చేరుకున్నాయి. ఈ క్రమంలో పసిడి కొనుగోలు చేయాలని భావించే వారు పెరుగుతున్న ధర చూసి వెనకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో మరి నేడు బంగారం ధర ఎంత ఉంది అంటే..

బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టాలకు చేరుకున్నాయి. ఈ క్రమంలో పసిడి కొనుగోలు చేయాలని భావించే వారు పెరుగుతున్న ధర చూసి వెనకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో మరి నేడు బంగారం ధర ఎంత ఉంది అంటే..

  • Published Dec 26, 2023 | 8:07 AMUpdated Dec 26, 2023 | 8:07 AM
Gold&Silver Rate: బంగారం కొనుగోలుదారులకు ఊరట.. నేటి ధరలు ఇవే

బంగారం కొనుగోలు చేయాలని అనుకున్నప్పటికి.. పెరుగుతున్న ధరలు చూసి సామాన్యుల గుండెలు గుభేలుమంటున్నాయి. అసలే ఇది వివాహాల సీజన్. గోల్డ్ కి భారీ డిమాండ్ ఉండటంతో.. ధర కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. అటు అంతర్జాతీయంగా కూడా పసిడి రేటు పరుగులు తీస్తోంది. ఇక మన దేశంలో అయితే బంగారం 10 గ్రాముల రేటు గరిష్టాలకు చేరుకున్న సంగతి తెలిసిందే. వెండి ధర కూడా రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. దాంతో చాలా మంది బంగారం కొనుగోలు చేయాలనే ఆలోచన వాయిదా వేసుకుంటున్నారు.. అత్యంత అవరసమైతే తప్ప గోల్డ్ కొనుగోలు ఆలోచన చేయడం లేదు. అయితే గత కొన్ని రోజులుగా పెరుగుతూ పోతున్న కనకం ధర.. నిన్న, నేడు స్థిరంగా ఉంది. కనుక పుత్తడి కొనుగోలు చేయాలనుకునేవారు ఇప్పుడే తర్వపడితే మంచిది అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. మరి నేడు మన దగ్గర పసిడి ధర ఎలా ఉంది అంటే..

వరుస సెలవులు ఉన్న సందర్భంగా బంగారం రేట్లలో ఎలాంటి మార్పు లేదు. ఇక నేడు హైదరాబాద్ లో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ గోల్డ్ ధరలో ఎలాంటి మార్పు లేదు. క్రితం సెషన్ లో ఉన్న ధరనే నేడు కూడా కొనసాగింది. ఇవాళ భాగ్యనగరం బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ పసిడి పది గ్రాముల రేటు రూ. 58,200 మార్క్ వద్ద కొసాగుతోంది. అలానే నేడు 24 క్యారెట్ మేలిమి బంగారం ధర కూడా పెరగలేదు. ఇవాళ హైదరాబాద్ లో 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల రేటు రూ. 63,490 వద్ద స్థిరంగా కొనసాగుతుంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా పుత్తడి ధర స్థిరంగా ఉంది. నేడు హస్తినలో 22 క్యారెట్ గోల్డ్ పది గ్రాముల ధర రూ.58,350 వద్ద స్థిరంగా ఉంది. అలానే 24 క్యారెట్ మేలిమి బంగారం పది గ్రాముల రేటు రూ. 63,640 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఢిల్లీతో పోలిస్తే.. హైదరాబాద్ లో బంగారం తక్కువగానూ.. వెండి ధర ఎక్కువగానూ ఉంటుంది. స్థానికంగా ఉండే పన్నులే దీనికి కారణం.

రూ.200 పెరిగిన వెండి..

నేడు దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి రేటు మాత్రం పెరిగింది. నేడు హైదరాబాద్ లో వెండి ధర కిలో మీద రూ.200 పెరిగింది. ఇక ఇవాళ భాగ్యనగరంలో కేజీ వెండి రేటు రూ. 80,700 మార్క్ వద్ద అమ్ముడవుతోంది. అలానే ఢిల్లీ మార్కెట్లో కూడా సిల్వర్ రేటు పెరిగింది. నేడు ఢిల్లీలో వెండి ధర కిలో మీద రూ.200 మేర పెరిగి ప్రస్తుతం రూ. 79,200 వద్ద అమ్ముడవుతోంది. ప్రస్తుతం బంగారం, వెండి రేట్లు ఆల్ టైమ్ గరిష్టాల వద్ద కొనసాగుతున్నాయి.. రానున్న కాలంలో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

అటు అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2055 డాలర్ల పైన కొనసాగుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 24.24 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి