iDreamPost

భయపెడుతున్న బంగారం.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన ధర

  • Published Sep 01, 2023 | 7:58 AMUpdated Sep 01, 2023 | 7:58 AM
  • Published Sep 01, 2023 | 7:58 AMUpdated Sep 01, 2023 | 7:58 AM
భయపెడుతున్న బంగారం.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన ధర

గత కొన్ని రోజులుగా దిగి వచ్చిన బంగారం ధర.. శ్రావణమాసం ప్రారంభం నుంచి వరుసగా పెరుగుతూ వస్తోంది. సిల్వర్‌, గోల్డ్‌ రేట్లు.. మరోసారి ఆల్‌ టైమ్‌ హై రికార్డు ధర దిశగా దూసుకుపోతుంది. ఇక రాఖీ పండుగ సందర్భంగా బంగారం కొందామని భావించిన వారికి.. భారీగా పెరిగిన పసిడి ధర పెద్ద షాక్‌ ఇచ్చింది. ఇక వరుసగా నేడు రెండో రోజు కూడా బంగారం ధర మరోసారి పెరిగింది. మరి నేడు హైదరాబాద్‌, ఢిల్లీలో బంగారం ధర ఎంత పెరిగింది.. 10 గ్రాముల ధర ఎంత ఉంది అంటే..

ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వరుసగా మూడు రోజుల నుంచి బంగారం ధర భారీగా పెరుగుతోంది. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల మీద రూ. 150 పెరిగి రూ. 55,150 వద్ద ట్రేడవుతోంది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం.. 10 గ్రాముల మీద నేడు రూ. 160 పెరిగి రూ. 60,160 వద్ద అమ్ముడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్లో కూడా గత మూడు రోజులుగా గోల్డ్‌ ధర పెరుగుతూనే ఉంది. నేడు హస్తినలో 22 క్యారెట్‌ బంగారం ధర 10 గ్రాముల మీద రూ.150 పెరిగి రూ. 55,300 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్‌ స్వచ్చమైన పసిడి ధర ఇవాళ రూ. 160 పెరిగి.. ప్రస్తుతం రూ. 60,310 వద్ద కొనసాగుతుంది.

స్థిరంగా వెండి ధర..

బంగారం ధర పెరుగుతుంటే వెండి ధర మాత్రం ఇవాళ స్థిరంగా ఉంది. అయితే గత రెండు రోజులుగా వెండి ధర భారీగా పెరిగి కిలో రేటు ఏకంగా రూ.80 వేలకు పైనే ట్రేడవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 80,700 మార్క్ వద్ద ట్రేడవుతోంది. క్రితం సెషన్‌లో వెండి ధర కిలో మీద రూ. 700 పెరిగిన విషయం తెలిసిందే. ఇక నేడు ఢిల్లీలో కూడా వెండి ధర స్థిరంగా ఉంది. నేడు హస్తినలో కిలో వెండి ధర రూ. 77,600 పలుకుతోంది. పెరుగుతున్న బంగారం, వెండి ధరలు చూసి.. పసిడి కొనాలంటేనే జనాలు భయపడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి