iDreamPost
android-app
ios-app

Gold Rate: మళ్లీ పెరిగిన గోల్డ్, సిల్వర్ ధరలు.. నేడు రేటు ఎంత ఉందంటే

  • Published Dec 02, 2023 | 8:37 AMUpdated Dec 02, 2023 | 8:37 AM

పెరగడమే తనకు తెలుసు.. దిగి వచ్చే చాన్స్ అస్సలే లేదు అన్నట్లుగా ఉంది బంగారం తీరు. గరిష్టా స్థాయికి చేరిన ధర మరింత పెరుగుతోంది. నేడు కూడా పసిడి, వెండి ధరలు పెరిగాయి. ఆ వివరాలు...

పెరగడమే తనకు తెలుసు.. దిగి వచ్చే చాన్స్ అస్సలే లేదు అన్నట్లుగా ఉంది బంగారం తీరు. గరిష్టా స్థాయికి చేరిన ధర మరింత పెరుగుతోంది. నేడు కూడా పసిడి, వెండి ధరలు పెరిగాయి. ఆ వివరాలు...

  • Published Dec 02, 2023 | 8:37 AMUpdated Dec 02, 2023 | 8:37 AM
Gold Rate: మళ్లీ పెరిగిన గోల్డ్, సిల్వర్ ధరలు.. నేడు రేటు ఎంత ఉందంటే

బంగారం కొనాలని భావించే వారికి ఇది కాస్త నిరాశకరమైన వార్తే. పెళ్లిళ్ల సీజన్ కదా.. కొద్ది మొత్తంలో అయినా పసిడి కొనుగోలు చేద్దామని భావించేవారు.. ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటేనే మంచిది. ఎందుకంటే గోల్డ్ రేటు అడ్డు అదుపు లేకుండా దూసుకుపోతుంది. పైగా ఇప్పట్లో దిగి వచ్చే అవకాశమే లేదని అంటున్నారు బులియన్ మార్కెట్ విశ్లేషకులు. అటు గ్లోబల్ బులియన్ మార్కెట్ లో సైతం పసిడి, వెండి రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. దేశీయంగా ఆ ప్రభావం గట్టిగానే ఉంది. ఇక నేడు కూడా పసిడి, వెండి రేట్లు పెరిగాయి. ఆ వివరాలు..

నేడు దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం ధర భారీగానే పెరిగింది. ఇక శనివారం నాడు హైదరబాద్ మార్కెట్ లో 22 క్యారెట్ గోల్డ్ రేటు పది గ్రాముల మీద 200 రూపాయలు పెరిగింది. క్రితం సెషన్లో భాగ్యనగరంలో 22 క్యారెట్ పసిడి రేటు రూ. 57,500 ఉండగా ఈరోజు రూ. 200 పెరిగి 57,700కు చేరింది. అలానే 24 క్యారెట్ మేలిమి బంగారం ధర కూడా పెరిగింది. శుక్రవారం నాడు హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ మేలిమి బంగారం పది గ్రాముల ధర  రూ.62,730 కాగా ఈరోజు  రూ.220 పెరిగి రూ. 62,950కి చేరింది .

ఇక దేశ రాజధాని ఢిల్లీలో సైతం బంగారం ధర పెరిగింది. నేడు హస్తినలో 22 క్యారెట్ పది గ్రాముల ధర 200 రూపాయలు పెరిగింది. దాంతో శనివారం నాడు హస్తినలో 22 క్రితం సెషన్ లో 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర 57,650 రూపాయలు ఉండగా.. నేడు 200 పెరిగి రూ.57,850 వద్ద ట్రేడవుతోంది. అలానే 24 క్యారెట్ మేలిమి బంగారం పది గ్రాముల ధర శుక్రవారం నాడు రూ. 62,880 ఉండగా నేడు 220 రూపాయలు పెరిగి.. 63,100 రూపాయల వద్ద ట్రేడవుతోంది.

బంగారం బాటలోనే వెండి..

నేడు పసిడి ధర పెరగ్గా.. వెండి రేటు కూడా అదే బాటలో పయనించింది. నేడు దేశీయ బులియన్ మార్కెట్ లో సిల్వర్ రేటు కిలో మీద 300 రూాయలు పెరిగింది. ఇక శనివారం నాడు హైదరాబాద్ మార్కెట్ లో వెండి ధర కిలో మీద 300 రూపాయలు పెరిగి.. ప్రస్తుతం రూ. 82,500 వద్ద అమ్ముడవుతోంది. అలానే ఢిల్లీ మార్కెట్ లో నేడు సిల్వర్ రేటు కిలో మీద 300 రూపాయలు పెరిగి..  79,500 వద్ద అమ్ముడవుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్ లో సైతం పసిడి, సిల్వర్ రేట్లు పెరుగుతున్నాయి. దాంతో గోల్డ్ రేటు ఇప్పట్లో దిగి వచ్చే అవకాశమే లేదంటున్నారు బులియన్ మార్కెట్ విశ్లేషకులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి