iDreamPost

బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. దిగి వస్తోన్న ధర

  • Published Sep 02, 2023 | 8:12 AMUpdated Sep 02, 2023 | 8:12 AM
  • Published Sep 02, 2023 | 8:12 AMUpdated Sep 02, 2023 | 8:12 AM
బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. దిగి వస్తోన్న ధర

శ్రావణమాసం ప్రారంభం అయిన దగ్గర నుంచి బంగారం రేటు భారీగా పెరుగుతోంది. మరోసారి గోల్డ్‌ రేటు గరిష్టాలకు చేరుకుంది. గత మూడు రోజులుగా బంగారం ధర భారీగా పెరిగి.. పసిడి కొనాలనుకునేవారికి కోలుకోలేని షాక్‌ ఇచ్చింది. ధర ఇలానే పెరిగితే.. ఇక సామాన్యులు బంగారం కొనడం కల్లే అనే మాటలు వినిపించాయి. అయితే బంగారం ధర ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం. ఇన్ని రోజులు పెరిగిన ధర నేడు ఒక్కసారిగా దిగి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర దిగి వస్తుండటంతో.. దేశీయంగా కూడా ధర తగ్గింది. మరి నేడు హైదరాబాద్‌, ఢిల్లీలో బంగారం ధర ఎంత తగ్గింది.. 10 గ్రాముల గోల్డ్‌ రేటు ఎంత ఉంది అంటే..

నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్‌ గోల్డ్‌ రేటు 10 గ్రాముల మీద రూ. 100 తగ్గి రూ.55,050కి దిగొచ్చింది. గడిచిన మూడు రోజుల్లో.. బంగారం ధర ఏకంగా రూ.700 పెరగడం గమనార్హం. ఇక ఇదే సమయంలో 24 క్యారెట్‌ స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాముల మీద రూ. 110 తగ్గి రూ. 60,050 మార్కు వద్ద ట్రేడవుతోంది. ఇక ఢిల్లీలో కూడా నేడు బంగారం ధర పడిపోయింది. నేడు హస్తినలో 22 క్యారెట్‌ గోల్డ్‌ రేటు 10 గ్రాముల మీద రూ.100 తగ్గి.. రూ.55,200 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు 24 క్యారెట్‌ పసిడి రేటు పది గ్రాముల మీద రూ.110 తగ్గి రూ.60,200 మార్కు వద్ద ట్రేడవుతోంది

భారీగా దిగి వచ్చిన వెండి ధర..

నేడు వెండి ధర బంగారం బాటలోనే పయనించింది. గత రెండు రోజుల్లో.. కిలో వెండి ధర రూ. 700 పెరగ్గా తాజాగా నేడు రూ. 500 దిగొచ్చింది. ఇక నేడు ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,100 వద్ద ఉంది. ఇక నేడు హైదరాబాద్‌లో కూడా సిల్వర్‌ రేటు భారీగా పతనమయ్యింది. నేడు కిలో వెండి ధర రూ. 500 పతనమై కేజీకి రూ.80,200 వద్ద ఉంది. ఇక నేడు ఇంటర్నేషనల్ మార్కెట్‌లో గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుపై 1940 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. స్పాట్ సిల్వర్ మాత్రం 24.21 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు వెలువడుతుండటంంతో.. బంగారం ధరలు మరింత దిగి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి