iDreamPost

బంగారం కొనాలనుకుంటున్నారా.. వెంటనే కొనండి.. నేటి ధరలు ఇవే

  • Published Sep 13, 2023 | 8:02 AMUpdated Sep 13, 2023 | 8:02 AM
  • Published Sep 13, 2023 | 8:02 AMUpdated Sep 13, 2023 | 8:02 AM
బంగారం కొనాలనుకుంటున్నారా.. వెంటనే కొనండి.. నేటి ధరలు ఇవే

ప్రపంచంలో భారతీయులు వినియోగించినంత పెద్ద మొత్తంలో మరేవరు బంగారాన్ని వాడరు. ఎంత పేదవారైనా సరే.. జీవితంలో ఏదో ఒక సందర్భంలో పసిడి కొనుగోలు చేస్తారు. మన దేశంలో బంగారానికి భారీ డిమాండ్‌ ఉన్నప్పటికి.. ఉత్పత్తి తక్కువ. దాంతో మనం ఎక్కువగా విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకుంటాము. ప్రపంచంలో పుత్తడిని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో ఇండియా ముందు వరుసలో ఉంటుంది. ఇక మన దగ్గర పుత్తడికి డిమాండ్‌ ఎక్కువ.. ఉత్పత్తి తక్కువగా ఉండటంతో.. ధర భారీగా ఉంటుంది.

ఈ ఏడాది ఇప్పటికే రెండు సార్లు గరిష్టాలకు చేరిన బంగారం ధర.. ఆగస్ట్‌ నెల ప్రారంభం నుంచి కొన్ని రోజుల పాటు వరుసగా దిగి వచ్చింది. కానీ శ్రావణమాసం ఆరంభం నుంచి క్రమంగా పెరుగుతుంది. క్రితం సెషన్‌లో పసిడి ధర స్వల్పంగా దిగి రాగా.. నేడు మాత్రం.. స్థిరంగా ఉంది. మరి బుధవారం రోజున దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర ఎంత ఉంది అంటే..

నేడు హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర స్థిరంగా ఉంది. ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర రూ. 54, 840 ఉంది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర కూడా స్థిరంగానే ఉంది. నేడు భాగ్యనగరం బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్‌ పసిడి 10 గ్రాముల ధర రూ. 59, 830 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధానిలో 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర రూ. 54, 990 ఉండగా.. 24 క్యారెట్‌ గోల్డ్‌ రేటు రూ. 59, 990 వద్ద ట్రేడవుతోంది.

భారీగా పెరిగిన వెండి ధర..

బంగారం ధర నేడు స్థిరంగా ఉండగా.. వెండి ధర మాత్రం పైపైకి ఎగబాకుతుంది. క్రితం సెషన్‌లో కిలో వెండి ధర రూ.500 పెరిగిన సంగతి తెలిసిందే. నేడు కూడా వెండి ధర భారీగా పెరిగింది. నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర 500 రూపాయలు పెరిగింది. అంటే రెండు రోజుల్లోనే వెండి ధర కిలో మీద 1000 రూపాయలు పెరిగింది. నేడు హైదరాబాద్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 78 వేల వద్ద ట్రేడవుతోంది. అలానే దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 74, 500గా ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి