iDreamPost

పసిడి ప్రియులకు షాక్‌.. మళ్లీ పెరిగిన బంగారం ధర

  • Published Aug 22, 2023 | 8:41 AMUpdated Aug 22, 2023 | 8:41 AM
  • Published Aug 22, 2023 | 8:41 AMUpdated Aug 22, 2023 | 8:41 AM
పసిడి ప్రియులకు షాక్‌.. మళ్లీ పెరిగిన బంగారం ధర

బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో సరిగా అంచనా వేయడం కష్టం. అంతర్జాతీయ పరిణామాలకు తగ్గట్టు పసిడి ధర తగ్గడం, పెరగడం వంటివి జరుగుతుంటాయి. ఇక ఆగస్ట్‌ నెల ప్రారంభం నుంచి బంగారం ధర దిగి రావడం లేదా.. స్థిరంగా ఉండటం జరిగింది. ఇక క్రితం సెషన్లో బంగారం ధర స్థిరంగా ఉంది. అయితే మన దగ్గర శ్రావణ మాసంలో పసిడికి డిమాండ్‌ బాగా ఎక్కువగా ఉంటుంది. దాంతో గోల్డ్‌ ధర పెరుగుతుంది. అయితే ఈ సారి శ్రావణ మాసం ప్రారంభం అయినా సరే బంగారం ధర తగ్గడం లేదా.. స్థిరంగా ఉండటం జరుగుతోంది. అయితే నేడు గోల్డ్‌ రేటు ఎంత పెరిగింది.. ఢిల్లీ, హైదరాబాద్‌లో నేడు బంగార ధర ఎంత ఉంది అంటే..

మన హైదరాబాద్‌లో చూసుకుంటే ఇవాళ 22 క్యారెట్‌ గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 50 పెరిగింది. ఇక మంగళవారం 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర రూ. 54,150 వద్ద ఉంది. అలాగే 24 క్యారెట్‌ బంగారం ధర 10 గ్రాముల మీద రూ. 50 పెరిగి ప్రస్తుతం రూ. 59,070 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధర స్వల్పంగా పెరిగింది. నేడు హస్తినలో 22 క్యారెట్‌ గోల్డ్ తులం రేటు రూ. 50 పెరిగి రూ. 54,300 మార్క్ వద్ద ఉంది. ఇక 24 క్యారెట్‌ స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాముల మీద రూ. 50 పెరిగి ప్రస్తుతం రూ. 59,220 మార్క్ వద్ద ట్రేడవుతోంది.

స్థిరంగా వెండి రేట్లు..

ఇక నేడు బంగారం ధర స్వల్పంగా పెరగ్గా.. వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. ఇక నేడు మన హైదరాబాద్‌ మార్కెట్లో చూసుకుంటే గోల్డ్‌ రేటు పెరిగినప్పటికీ వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. నేడు హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ. 76,500 మార్క్ వద్ద ట్రేడ్‌ అవుతోంది. అయితే ఢిల్లీ మార్కెట్లో మాత్రం నేడు సిల్వర్‌ ధర పెరిగింది. మంగళవారం హస్తినలో వెండి ధర కిలోపై రూ. 200 పెరిగి రూ. 73,500 పలుకుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి