iDreamPost

పసిడి ప్రియులకు శుభవార్త.. నేడు బంగారం ధర ఎంతంటే!

  • Published Aug 19, 2023 | 8:23 AMUpdated Aug 19, 2023 | 8:23 AM
  • Published Aug 19, 2023 | 8:23 AMUpdated Aug 19, 2023 | 8:23 AM
పసిడి ప్రియులకు శుభవార్త.. నేడు బంగారం ధర ఎంతంటే!

శ్రావణమాసం ప్రాంరభం అయ్యింది. పండుగలు, వివాహాది శుభకార్యాలు జోరందుంకుంటాయి. ఇక మన దగ్గర శ్రావణ మాసంలో బంగారం కొనుగోళ్లు భారీగా జరుగుతాయి. మహాలక్ష్మి వ్రతం సందర్భంగా చాలా మంది మహిళలు బంగారం కొనడానికి ఆసక్తి చూపుతారు. ఇక మన దేశంలో పసిడి లేకుండా పెళ్లి వేడుక జరగడం కల్ల. బంగారానికి డిమాండ్‌ పెరిగితే.. ఆటోమెటిగ్గా ధర కూడా పెరుగుతుంది. అయితే ఈ ఏడాది మాత్రం అందుకు కాస్త భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఆగస్ట్‌ నెలలో బంగారం, వెండి ధరలు భారీగా దిగి వస్తున్నాయి. గత పది సెషన్లలో ఏకంగా 7 సార్లు పసిడి రేటు పడిపోయింది. మరి నేడు బంగారం ధర ఎలా ఉంది.. హైదరాబాద్‌, ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర ఎంత పలుకుతుంది అంటే..

నేడు హైదరాబాద్‌తో పాటే దేశరాజధాని ఢిల్లీలో కూడా బంగారం రేటు స్థిరంగానే ఉంది. నేడు హైదరాబాద్‌ మార్కెట్‌లో 22 క్యారెట్‌ గోల్డ్‌ 10 గ్రాముల ధర రూ. 54,100 వద్ద ఉంది. అలానే 24 క్యారెట్‌ స్వచ్ఛమైన మేలిమి బంగారం ధర కూడా స్థిరంగా ఉంది. ఇక నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్‌ గోల్డ్‌ 10 గ్రాముల ధర రూ. 59,020 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా నేడు పుత్తడి ధర స్థిరంగా ఉంది. అక్కడ 22 క్యారెట్‌ గోల్డ్‌ 10 గ్రాముల రేటురూ. 54,250 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్‌ స్వచ్ఛమైన బంగారం ధర రూ.59,170 మార్కు వద్ద ఉంది.

ఇక ఆగస్టు ఒక్క నెలలోనే పసిడి రేటు రూ. 1000కిపైగా దిగొచ్చింది. గత 10 రోజుల్లోనే 10 గ్రాముల ధర ఏకంగా రూ. 1000 పడిపోవడం విశేషం. ఇక మే నెల నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు అనగా ఈ 3 నెలల వ్యవధిలోనే పసిడి రేటు ఏకంగా రూ. 3100 తగ్గింది. మరి కొన్ని రోజుల పాటు ఇదే పంథా కొనసాగుతుంది అని బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

భారీగా పెరిగిన వెండి ధర…

నేడు బంగారం ధరలు స్థిరంగా ఉంటే.. వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. నేడు ఢిల్లీలో కేజీ సిల్వర్‌ రేటు ఏకంగా రూ.1000 పెరిగి ప్రస్తుతం రూ. 73,500 మార్కు వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో కూడా వెండి ధర కిలో మీద రూ. 1000 ఎగబాకి రూ. 76,700 వద్ద ట్రేడవుతోంది. ఇక ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1888 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. స్పాట్ సిల్వర్ ఏమో 22.77 డాలర్ల వద్ద ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి