iDreamPost

గుడ్‌ న్యూస్‌ మూడో రోజు భారీగా పడిపోయిన బంగారం, వెండి ధర

  • Published Aug 11, 2023 | 8:25 AMUpdated Aug 11, 2023 | 8:25 AM
  • Published Aug 11, 2023 | 8:25 AMUpdated Aug 11, 2023 | 8:25 AM
గుడ్‌ న్యూస్‌ మూడో రోజు భారీగా పడిపోయిన బంగారం, వెండి ధర

బంగారం కొనాలనుకుంటున్న వారికి భారీ శుభవార్త.. వరుసగా మూడో రోజు కూడా బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి. ఇదే పంథా కొనసాగితే.. శ్రావణ మాసంలో బంగారం కొనుగోళ్లు పెరుగుతాయని అంటున్నారు బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు. గరిష్ట స్థాయికి చేరిన బంగారం ధర.. తాజాగా 60 వేల రూపాయల దిగువకు పడిపోయింది. శ్రావణ మాసంలో బంగారం కొనాలని భావిస్తోన్న మహిళలకు ఇది మంచి శుభవార్త అని చెప్పవచ్చు. గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు భారీగా దిగి వస్తున్నాయి కనుక ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిది అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. హైదరాబాద్‌, ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయి.. ఎంత దిగి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.

గ్లోబల్‌ మార్కెట్‌లో బంగారం ధర దిగి రావడంతో.. దేశీయంగా కూడా ధర తగ్గింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో వరుసగా మూడో రోజు కూడా బంగారం ధర కుప్పకూలింది. ఇక నేడు హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్‌ బంగారం పది గ్రాముల బంగారం ధర రూ. 250 పడిపోయి రూ. 54,700 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్‌ స్వచ్ఛమైన గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 280 తగ్గి ప్రస్తుతం రూ. 59,670 వద్ద ట్రేడవుతోంది. అలానే ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధర పడిపోయింది. నేడు హస్తినలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాముల మీద 250 పడిపోయి రూ. 54,850 దిగి వచ్చింది. ఇక 24 క్యారెట్‌ మేలిమి బంగారం 10 గ్రాముల రేటు రూ. 290 తగ్గి.. రూ. 59,820 వద్ద ట్రేడవుతోంది.

నేడు మరో 500 తగ్గిన వెండి ధర..

బంగారం దారిలోనే వెండి ధర సైతం వరుసగా పడిపోతోంది. గత నాలుగు రోజుల్లోనే కిలో వెండి మీద ఏకంగా రూ. 2300 దిగివచ్చింది. నేడు మరోసారి వెండి ధర దిగి వచ్చింది. శుక్రవారం కిలో వెండి ధర మరో రూ.500 పడిపోయింది. మన హైదరాబాద్ బులియన్ మార్కెట్లో చూస్తే ఇవాళ కిలో వెండి ధర రూ. 76,200 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూస్తే కిలో వెండి రేటు రూ. 500 తగ్గి.. ప్రస్తుతం రూ. 73 వేల మార్క్ వద్ద ట్రేడవుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లలోనూ బంగారం ధర వరుసగా దిగి వస్తోంది. గ్లోబల్‌ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు నాలుగు రోజుల్లోనే దాదాపు 45 డాలర్ల వరకు పడిపోయింది. నేడు ఇంటర్నేషనల్‌ బులియన్‌ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1915 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు సైతం కాస్త దిగివచ్చింది. ఇవాళ స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 22.76 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి