iDreamPost

పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా దిగి వచ్చిన బంగారం, వెండి ధరలు

  • Published Aug 09, 2023 | 8:12 AMUpdated Aug 09, 2023 | 8:12 AM
  • Published Aug 09, 2023 | 8:12 AMUpdated Aug 09, 2023 | 8:12 AM
పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా దిగి వచ్చిన బంగారం, వెండి ధరలు

భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పండగలు, వివాహాది శుభకార్యల సమయల్లో పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తారు. బంగారం అంటే మన దృష్టిలో ఆభరణం మాత్రమే కాదు అక్కరకు ఆదుకునే పెన్నిది. మన దగ్గర బంగారానికి భారీ డిమాండ్‌ ఉన్నప్పటికి.. ఉత్పత్తి మాత్రం ఆ స్థాయిలో లేదు. ప్రపంచంలో బంగారాన్ని భారీగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్‌ ముందు వరుసలో ఉంటుంది. ధర ఎంత పెరిగినా సరే.. బంగారం కొనుగోళ్లు మాత్రం ఆగవు. ఇక మరి కొద్ది రోజుల్లో శుభకార్యాల సీజన్‌ ప్రారంభం కానుంది. దాంతో పసిడికి మళ్లీ డిమాండ్‌ పెరుగుతుంది. మరి ధర అంటే.. గత రెండు మూడు రోజులుగా బంగారం ధర దిగి వస్తూనే ఉంది. ఇక నేడు గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు భారీగా పడిపోయాయి. మరి నేడు హైదరాబాద్, ఢిల్లీలో బంగారం ధర ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం..

నేడు హైదరాబాద్‌లో బంగారం ధర స్వల్పంగా దిగి వచ్చింది. భాగ్యనగరంలో బుధవారం నాడు 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర రూ. 100 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్‌ గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 55,050 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 24 మేలిమి బంగారం ధర కూడా రూ. 100 తగ్గి ప్రస్తుతం రూ. 60,060 గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా నేడు బంగారం ధర స్వల్పంగా దిగి వచ్చింది. నేడు హస్తినలో 22 క్యారెట్‌ గోల్డ్‌ రేటు 10 గ్రాముల మీద రూ. 100 తగ్గి ప్రస్తుతం రూ. 55,200 గా ఉంది. అలాగే 24 క్యారెట్‌ స్వచ్ఛమైన గోల్డ్ రేటు కూడా రూ. 100 పడిపోయి ప్రస్తుతం రూ. 60,210 వద్ద ట్రేడవుతోంది.

భారీగా దిగి వచ్చిన వెండి ధర..

నేడు దేశీయ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా దిగి రాగా.. వెండి రేటు మాత్రం భారీగా కుప్పకూలింది. కిలో మీద ఏకంగా 1000 రూపాయలు దిగి వచ్చింది. ఇక నేడు మన హైదరాబాద్‌లో కిలో వెండి రేటు ఏకంగా రూ.1000 దిగివచ్చి.. ప్రస్తుతం 77,300 రూపాయల వద్ద ట్రేడవుతోంది. గడిచిన రెండు రోజుల్లో హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 1200 పడిపోయింది. అలానే దేశ రాజధానిలోనూ వెండి ధరలు భారీగానే పడిపోయింది. నేడు హస్తినలో కిలో వెండి రేటు రూ. 1000 దిగివచ్చింది. ప్రస్తుతం ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 75,100 వద్దకు దిగివచ్చింది.

ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర భారీగా దిగి వస్తోంది. గడిచిన రెండు రోజుల్లోనే ఏకంగా 20 డాలర్ల మేర పడిపోయింది. ఇవాళ ఔన్సు గోల్డ్ రేటు దాదాపు 8 డాలర్ల మేర దిగివచ్చింది. ప్రస్తుతం ఇంటర్నేషనల్‌ బులియన్‌ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1925 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటులో సైతం తగ్గుదల కనిపించింది. ఇవాళ స్పాట్ సిల్వర్ రేటు 22.77 వద్ద ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి