iDreamPost

కోరికను చంపుకోలేక.. తల్లిదండ్రులను ఎదరించలేక యువతి దారుణం!

కోరికను చంపుకోలేక.. తల్లిదండ్రులను ఎదరించలేక యువతి దారుణం!

నేటికాలం యువతలో ఆత్మస్థైర్యం, మనో ధైర్యం, ఆత్మవిశ్వాసం వంటివి లోపించాయి. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు భయాందోళనకు గురవుతుంటారు. అలానే తాము అనుకున్న లక్ష్యాలు నిరవేరక పోతే.. తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. అలానే ఇంట్లో వారితో గొడవలు పడినప్పుడు, పరీక్షల్లో ఫెయిలైనప్పుడు, ఇతర చిన్న చిన్న కారణాలతో కొందరు యువత ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా ఓ యువతి కూడా క్షణికావేశంలో పిచ్చి పని చేసింది. తల్లిదండ్రులు పెళ్లి చేస్తామనడంతో.. ఇష్టం లేక బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో  చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కనిమెట్ట గ్రామంలో రాజగోపాల రావు, రమణమ్మ దంపతులు ఉన్నారు. వీరి మోహన కుమారి(20)అనే కుమార్తె ఉంది. ఆ యువతి శ్రీకాకుళంలోని  ప్రభుత్వ డిగ్రీ కళశాలలో థర్డ్ ఇయర్ చదువుతోంది.  అయితే ఇదే సమయంలో కుమారికి పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు నిశ్చయించుకున్నారు. అదే విషయాన్ని రమణమ్మ దంపతులు కుమారికి తెలియజేశారు. అయితే తాను చదువుకుంటానని, ఇప్పుడు పెళ్లి వద్దని తల్లిదండ్రులకు తెలిపింది.  కుటుంబ పరిస్థితి అర్ధం చేసుకోవాలని కుమారికి తల్లిదండ్రులు సూచించారు.

దీంతో  పెళ్లి చేసుకుంటే తన చదువు ఆగిపోతుందని.. చాలా రోజుల పాటు తనలో తానే వేదనకు గురైంది. చదువుకోవాలనే కోరికను చంపుకోలేక, అమ్మనాన్న మాట కాదన లేక మానసిక ఒత్తిడికి గురైంది. ఇలాంటి సమయంలో బుధవారం ఉదయం కుమారి తల్లిదండ్రులు.. పనుల మీద బయటకు వెళ్లారు.  ఇంట్లో ఎవరూ లేని సమయంలో  మోహన కుమారి ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్ది సేపటి తరువాత ఇంటికి వచ్చిన తల్లి.. ఎంతసేపు తలుపు కొట్టినా తీయలేదు. దీంతో అనుమానం వచ్చి.. చుట్టుపక్కల వారిని పిలిచింది. వారు వచ్చి తలుపును బలవంతంగా తెరచి చూడగా..లోపల యువతి ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది.

దీంతో వెంటనే కిందకు దింపి పరీక్షంగా.. అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం  అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చేతికి అందివచ్చిన కుమార్తె.. ఇలా దారుణమైన నిర్ణయం తీసుకోవడంతో మృతురాలి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. మరి.. ఇలా క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడుతున్న యువతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి