iDreamPost

యానంలో అగ్నిప్రమాదం..బూడిదైన బోటు! అందులోని..

తరచూ ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటాయి. వీటి కారణంగా ఎందరో అమాయకులు కాలి బూడిదగా మారుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే యానాంలో చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో బోటు కాలి బూడిదకావడంతో పాటు ఓ ఘోరం చోటుచేసుకుంది.

తరచూ ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటాయి. వీటి కారణంగా ఎందరో అమాయకులు కాలి బూడిదగా మారుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే యానాంలో చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో బోటు కాలి బూడిదకావడంతో పాటు ఓ ఘోరం చోటుచేసుకుంది.

యానంలో అగ్నిప్రమాదం..బూడిదైన బోటు! అందులోని..

ఇటీవల తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా  షార్ట్ సర్క్యూట్, రసాయనాల పేలుడు వంటి ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఇక ఈ అగ్నిప్రమాదాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటారు. మరెందరో తీవ్ర గాయాలతో జీవితాన్ని నరకంగా అనుభవిస్తుంటారు. ఇక ఈ ప్రమాదాల కారణంగా భారీ ఆస్తి నష్టం కూడా జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇటీవలే విశాఖపట్నంలోని హార్బర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో బోట్లు కాలిబూడిదయ్యాయి. తాజాగా యానాంలో ఓ బోటుకు అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో దారుణం చోటుచేసుకుంది.

కేంద్ర పాలిత ప్రాంతం యానాంలోని దరియాల తిప్ప వద్ద అగ్నిప్రమాదం జరిగింది. దరియాల తిప్ప వద్ద ఉన్న ఓ బోటు నుంచి మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలో ఆ బోటును మంటలు చుట్టు ముట్టాయి. ఇక ఈ ప్రమాదంలో బోటులో గంగాద్రి అనే వ్యక్తి  చిక్కుకున్నాడు. తప్పించుకునే అవకాశం లేకపోవడంతో అందులోని చిక్కుకుపోయి.. మంటల్లో సజీవదహనమయ్యారు. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటన స్థలానికి చేరుకున్నారు.

అంతేకాక బోటు నుంచి ఎగసి పడుతున్న మంటలను అదుపు చేశారు. ఇక  ఈ ప్రమాదానికి గురైన పోటు భైరవ పాలెం నుంచి గౌతమి నది నుంచి దరియాల తిప్పకు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని అందులో చిక్కుకున్న వ్యక్తి  కాపాడే ప్రయత్నం చేశారు. అయితే మంటలు పెద్ద ఎత్తున ఎగసి పడుతుండటంతో కాపాడే సాహసం చేయలేక పోయారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు  ప్రమాదనికి కారణం ఏంటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో విశాఖలోని షిప్ హార్బర్ లో కూడా ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో బోటులు కాలి బూడిదయ్యాయి.

విశాఖ ఘటన అప్పట్లో పెను సంచలనంగా మారింది. అలానే కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లోని నాంపల్లి ప్రాంతంలోని ఓ భవనంలో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అక్కడ రసాయనాలు నిల్వ ఉన్న డ్రమ్ములు పేలిపోవడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో  తొమ్మిది మంది మరణించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా యానాంలో కూడా  అగ్నిప్రమాదం సంభవించి.. ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యారు. ఇలా అనుకోకుండా జరిగే ప్రమాదల కారణంగా చాలా మంది మృత్యు ఒడికి చేరుతున్నారు. మరి.. తాజాగా యానాంలో జరిగిన బోటు ప్రమాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి