iDreamPost

అందమైన జీవితాన్ని ఊహించుకుంది! కానీ.. వేరేలా జరిగి..చివరకు!

ప్రతి ఒక్కరు పెళ్లి తరువాత కొత్త జీవితం గురించి ఎన్నో కలలు కంటారు. అలానే ఓ మహిళ కూడా తన జీవితంపై ఎన్నో కోరికలు, ఆశలతో ఉంది. కానీ కుటుంబలో ఏం జరిగిందో తెలియదు కానీ.. చివరకు విగత జీవిగా మారింది.

ప్రతి ఒక్కరు పెళ్లి తరువాత కొత్త జీవితం గురించి ఎన్నో కలలు కంటారు. అలానే ఓ మహిళ కూడా తన జీవితంపై ఎన్నో కోరికలు, ఆశలతో ఉంది. కానీ కుటుంబలో ఏం జరిగిందో తెలియదు కానీ.. చివరకు విగత జీవిగా మారింది.

అందమైన జీవితాన్ని ఊహించుకుంది! కానీ.. వేరేలా జరిగి..చివరకు!

పెళ్లి అనేది చాలా ప్రత్యేకమైనది. రెండు వేరువేరు  మనస్సులను ఒకటి చేసే ప్రత్యేక వేడుకే వివాహం. ఇక తమ సంసార జీవితంపై యువత ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు తమ భాగస్వామి గురించి.. పెళ్లి తరువాత కొత్త జీవితం గురించి ఎన్నో కలలు కంటారు. అలానే ఓ మహిళ కూడా తన జీవితంపై ఎన్నో కోరికలు, ఆశలతో ఉంది. అందుకు తగ్గట్లే ఇద్దరు అపూరమైన పిల్లలు ఉన్నారు. కానీ కుటుంబలో ఏం జరిగిందో తెలియదు కానీ.. చివరకు విగత జీవిగా మారింది. ఆమెతో పాటు భర్త కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన శ్రీధర్‌ (28)కు ప్రత్తిపాడుకు చెందిన దేవి (22) అనే ఆమెతో ఎనిమిదేళ్ల కిందట పెళ్లి జరిగింది. వీరికి ఏడేళ్ల కొడుకు, ఆరేళ్ల కుమార్తె ఉన్నారు. ఇక శ్రీధర్ తాపీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించే వాడు. ఏడాది కిందట శ్రీధర్ కి ప్రమాదం జరగడంతో మరొకరిపై ఆధార పడే పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో భార్య దేవికి ఫిట్స్ ఉన్నట్లు సమాచారం. ఇలా ఇద్దరికి సమస్య ఉంటే..మధ్యలో వారికి తరచూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెపుతున్నారు. ఈక్రమంలోనే నెల రోజుల క్రితం దేవి పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.

భార్య దేవిని తిరిగి తీసుకోచ్చేందుకు శ్రీధర్‌ వారం కిందట అత్తారింటికి వెళ్లాడు. పిల్లలను ప్రత్తిపాడులో వదిలేసి భార్యాభర్తలిద్దరూ కలసి రాజమండ్రిలోని ఆనంద్‌నగర్‌లోని తన ఇంటికి శనివారం ఉదయం వచ్చారు.  ఇక ఉదయం ఇంట్లోకి వెళ్లిన వాళ్లు మధ్యాహ్నం వరకూ తలుపు వేసి ఉండడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. తలుపులు ఎంత తట్టినా తీయలేదు. అనుమానం వచ్చి ఇంటి వెనుకవైపు నుంచి వెళ్లి తలుపులు తీసి చూడగా దంపతులిద్దరు విగతజీవులుగా కనిపించారు. దీంతో వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.

దేవి మెడకు చున్నీ ఉండడం, ఆమె కిందపడిపోయి ఉంది. దీంతో దేవిని చంపి శ్రీధర్‌ ఆత్మహత్య చేసుకున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాలను సీఐ వీరయ్య గౌడ్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మొత్తంగా ఏది ఏమైనప్పటికీ అనుమానస్పద స్థితిలో దంపతులు మృతిచెందడం స్థానికంగా కలకలం రేపింది. ఇలాంటి ఘటనలు తరచూ  జరుగుతున్నాయి. కారణం ఏదైనప్పటి దంపతుల మధ్య జరిగే గొడవలు సంసారాన్ని నిట్టనిలువును కూల్చేస్తున్నాయి. తాజాగా ఈ దంపతుల మృతితో వారి పిల్లలు అనాథలుగా మారారు. ఇలాంటి కష్టం పగవారికి కూడా రాకుడదంటూ బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి