iDreamPost

15నెలల బిడ్డను చంపిన తల్లి.. సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు!

ఈ భూమి మీద అమ్మ ప్రేమకు మించి విలువైనది ఏమీలేదు. తల్లి.. తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచి పెద్ద చేస్తుంది. అయితే నేటి కాలంలో కొందరు తల్లులు పిల్లల పాలిటి యమదూతలుగా మారుతున్నారు. పేగు బంధాన్ని మరచి ప్రాణాలు తీస్తున్నారు.

ఈ భూమి మీద అమ్మ ప్రేమకు మించి విలువైనది ఏమీలేదు. తల్లి.. తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచి పెద్ద చేస్తుంది. అయితే నేటి కాలంలో కొందరు తల్లులు పిల్లల పాలిటి యమదూతలుగా మారుతున్నారు. పేగు బంధాన్ని మరచి ప్రాణాలు తీస్తున్నారు.

15నెలల బిడ్డను చంపిన తల్లి.. సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు!

ప్రపంచంలో అన్నిటికన్నా తల్లీబిడ్డల మధ్యన ఉండే రక్త సంబంధం అత్యంత బలమైనది. బిడ్డల కోసం తల్లి ఎన్నో త్యాగాలను చేస్తుంది. తాను కష్టాలు పడుతూ బిడ్డల సంతోషం కోసం పరితపిస్తుంది. తన బిడ్డకు ఏ చిన్న దెబ్బ తగిలిన.. తల్లి అల్లాడిపోతుంది. అయితే నేటి కాలంలో కొందరు తల్లులు మాత్రం పిల్లల పాలిట యమదూతల్లా మారుతున్నారు. కన్న బిడ్డలనే బరువు అనుకుని చెత్తకుండీలో వదిలేయడం, చంపేయడం వంటి ఘటనలు జరిగాయి. కొంతకాలం క్రితం ఓ తల్లి  తన రక్తం పంచుకుని పుట్టిన నెలల కొడుకుని.. గొంతు నులిమి హతమార్చింది. తాజాగా ఆ కసాయి తల్లికి కోర్టు తగిన శిక్ష వేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కేరళకు చెందిన ఇడుక్కి జిల్లాలో తొడుపుజా అనే ప్రాంతంలో జైసమ్మ(28) తన కుటుంబంతో కలిసి జీవిస్తుంది. ఆమెకు 2016 నాటికి 15నెలల కుమారుడు ఉన్నాడు. అదే సమయంలో  జైసమ్మ కుటుంబంలో గొడవలు జరుగుతుండేవంట. అలా ఆమె కుటుంబంలో జరిగిన వివాదం ఆ బిడ్డ ప్రాణాన్ని బలి తీసుకుంది. 2016 ఫిబ్రవరి 16వ తేదీ రాత్రి జైసమ్మ.. ఆమె గదిలో..  కన్న కొడుకును గొంతు నులిమి అతి దారుణంగా హత్య చేసింది.

జైసమ్మ తన బిడ్డను చంపిన తరువాత.. ఆమె కూడా చేయి కోసుకుని చనిపోవాలని ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే గదిలో నుంచి రక్తం రావడం చూసిన కుటుంబీకులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెను ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందించారు. అనంతరం ఆమెను అరెస్టు చేసి జైలుకు తరలించారు.  అప్పటి నుంచి గత ఏడేళ్లుగా ఈ కేసు కోర్టులో నడుస్తూనే ఉంది. కుటుంబ సమస్యల వలన కలిగిన మానసిక ఒత్తిడి కారణంగానే ఆ హత్య జరిగిందని కోర్టు భావించింది.

అయితే అందుకు  తగిన ఆధారాలు లేకపోవడంతో ఇడుక్కి జిల్లా సెషన్స్  కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. కాబట్టి సరైన ఆధారాలు లేనందున.. ఇప్పటివరకు బెయిల్ పై ఉన్న జైసమ్మకు..  ఈరోజు అనగా డిసెంబర్1 న యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తూ కోర్టు తుది తీర్పును ఇచ్చింది. అయితే, ఈ తీర్పుకు వ్యతిరేకంగా బాధితులు హై కోర్టును సంప్రదించాలని భావించారు. ఏది ఏమైనా, క్షణికావేశంలో, మానసిక సమస్యల వలన ఓ పసివాడు ప్రాణం తీయడం దారుణం. ఈరోజుల్లో రక్త సంబంధాలు క్షణికావేశాలకు బలైపోతున్నాయి. దాదాపు ఏడేళ్ల క్రితం జరిగిన ఓ దారుణ సంఘటనకు ఎట్టకేలకు ఈరోజు సరైన శిక్షను విధించాని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి.. కన్న బిడ్డను హతమార్చిన ఆ కసాయి తల్లికి కోర్టు వేసిన శిక్షపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి