iDreamPost

మద్యం మత్తులో సొంత కూతురిపై తండ్రి దారుణం! వీడు అసలు మనిషేనా?

నేటికాలంలో కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రులే కాలయుడిలాగా మారుతున్నారు. బిడ్డలకు ఏదైనా ఆపద వస్తే రక్షించాల్సింది పోయి.. ఆపదలోకి నెట్టేస్తున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే.. కొందరు పశువులుగా మారి..కన్నకూతుర్లపై దారుణాలకు పాల్పడుతున్నారు.

నేటికాలంలో కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రులే కాలయుడిలాగా మారుతున్నారు. బిడ్డలకు ఏదైనా ఆపద వస్తే రక్షించాల్సింది పోయి.. ఆపదలోకి నెట్టేస్తున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే.. కొందరు పశువులుగా మారి..కన్నకూతుర్లపై దారుణాలకు పాల్పడుతున్నారు.

మద్యం మత్తులో సొంత కూతురిపై తండ్రి దారుణం!  వీడు అసలు మనిషేనా?

నేటికాలంలో మనుషుల రూపంలో ఉన్న పశువులు సంఖ్య పెరిగిపోతుంది. వావివరుసలు కుటుంబ సభ్యులపైనే దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇది ఇలా ఉంటే.. మద్యం మత్తులో కొందరు కన్నబిడ్డలపైనే అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఓ హృదయావిదారక ఘటన బీహార్ రాష్ట్రంలో వెలుగు చూసింది. మద్యం మత్తులో ఉన్న తండ్రి..కుమార్తెను అత్యంత దారుణంగా చంపేశాడు. అంతేకాక..ఆమెను ఇంట్లోనే పాతిపెట్టి..రాత్రంతా సమాధిపైనే పడుకున్నాడు. ఇక ఈ ఘోరమైన ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..

బీహార్ రాష్ట్రంలోని తూర్పు చంపారన్ జిల్లా రామ్‌గర్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని ముర్లా గ్రామంలోని వార్డు నంబర్ 7లో భగవాన్ దాస్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడికి పెళ్లై సోనీ అనే పదేళ్ల కుమార్తె ఉంది. ఇక భగవాన్ దాస్ మద్యానికి బానిసగా మారి..భార్యను వేధిస్తుండే వాడు. తరచూ మద్యం తాగొచ్చి.. భార్యతో గొడవ పడుతుండే వాడు. అయితే తన పదేళ్లే కుమార్తెను చూసి..భగవాన్ దాస్ భార్య..భర్త పెట్టే వేధింపులను భరిస్తూ వచ్చింది. ఆదివారం సాయంత్రం కూడా భగవాన్ దాస్ మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న దాస్ భార్యతో గొడవకు దిగాడు. అంతేకాక ఆమెపై దాడి చేయడంతో భయంతో పొరుగు వారి ఇంటికి వెళ్లింది.

అదే సమయంలో ఇంట్లో 10 ఏళ్ల కుమార్తె సోనీ ఉంది. ఈ క్రమంలోనే మద్యం తాగొద్దని భగవాన్ దాస్ కుమార్తె సోనీ తండ్రిని మందలించింది. అయితే మత్తులో ఉన్న దాస్ పశువుగా మారాడు. తన బిడ్డ చెప్పిన మాటలకు ఆగ్రహంతో ఊగిపోయాడు. అంతేకాక సోనిపై దాడికి తెగ బడ్డాడు. ఆమెపై దాడి చేసి..గొంతుకోసి అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఇంట్లోనే గొయ్యి తవ్వి సోనీ మృతదేహాన్ని పాతిపెట్టాడు. ఆ తరువాత కుమార్తె సమాధిపై ఒక మంచం వేసుకుని రాత్రంతా నిద్రించాడు. మరుసటి రోజు తెల్లవారుజామున తాను చేసిన హత్య గుర్తుకు వచ్చి..ఇంటి నుంచి పారిపోయాడు. భగవాన్ దాస్ చేసిన ఈ హత్యను వారి కుమారులు చూశారు.

ఆ పిల్లలు జరిగిన విషయం గురించి తమ కుటుంబాలకు తెలిపారు. భర్త చేసిన పనికి అతడి భార్య ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనపై మృతురాలి తల్లి, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడి చేరుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అంతేకాక స్థానిక మేజిస్ట్రేట్ సమక్షంలో గొయ్యి తవ్వి బాలిక మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు భగవాన్ దాస్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తంగా ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. మరి.. ఇలాంటి వ్యక్తులను ఏ విధంగా శిక్షించాలి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి