iDreamPost

నాన్ వెజ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్ ధరలు.. కిలో ఎంతంటే?

Today Chicken Prices: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాన్ వెజ్ ప్రియులకు శుభవార్త అందింది. ఇవాళ చికెన్ ధరలు భారీగా తగ్గాయి. ఎక్కడ కిలో ధర ఎంత ఉందంటే..

Today Chicken Prices: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాన్ వెజ్ ప్రియులకు శుభవార్త అందింది. ఇవాళ చికెన్ ధరలు భారీగా తగ్గాయి. ఎక్కడ కిలో ధర ఎంత ఉందంటే..

నాన్ వెజ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్ ధరలు.. కిలో ఎంతంటే?

విడి రోజుల్లో ఏ కూరలు తిన్నా.. ఆదివారం అంటే మాత్రం ముక్క లేనిదే ముద్ద దిగదు. చాలామంది పరిస్థితి ఇలాగే ఉంటుంది. ప్రతి వారం మటన్ తినాలి అంటే బడ్జెట్ సమస్యలు వస్తాయి. అలాగని చేపలు తినాలన్నా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే చాలామంది బెస్ట్ ఆప్షన్ గా చికెన్ ఉంటుంది. ఆదివారం వస్తే పొద్దున్నే లేచి చికెన్ షాప్ కి వెళ్లాల్సిందే. అలాంటి వారికి గత 20 రోజులుగా చికెన్ ధరలు షాకిచ్చిన విషయం తెలిసిందే. కేజీ స్కినె లెస్ చికెన్ ధర రూ.320 దాకా పలికింది. అలాంటి సమయంలో చాలా మంది నాన్ వెజ్ ప్రియులు బాగా బాధ పడిపోయారు. అలాంటి వారికి ఇది తీపి కబురు అనే చెప్పాలి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో గత 20 రోజుల సమయంలో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకాయి. కేజీ చికెన్ ధర రూ.320 దాకా పలికింది. చాలామంది చికెన్ ధరలను చూసి లబోదిబో అన్నారు. ఎందుకంటే చాలామందికి వారాంతంలో ముక్క లేనిదే ముద్ద దిగదు కాబట్టి. అలాంటి వారికి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో శుభవార్త అందింది. అదేంటంటే.. చికెన్ ధరలు దిగొచ్చాయి. గత కొన్ని రోజులుగా క్రమంగా తగ్గుతూ వచ్చిన ధరలు.. ఇప్పుడు మరింత తగ్గాయి. తాజాగా తెలంగాణలో కిలో చికెన్ ధర స్కిన్ లెస్ అయితే.. రూ.200 నుంచి రూ.210 వరకు ఉంది. కిలో చికెన్ స్కిన్ తో అయితే రూ.180 వరకు విక్రయిస్తన్నారు.

అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంచుమించు ఇవే ధరలు ఉన్నాయి. వారం రోజుల నుంచి కిలో చికెన్ రూ.300 పెట్టి కొనుగోలు చేసిన వారంతా ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చికెన్ ధరలు తగ్గడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలా ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి కనిపించడం లేదు. కోళ్ల లభ్యత ఎక్కువగా ఉండటం వల్ల ఇప్పుడు చికెన్ ధర తగ్గింది. త్వరలోనే చికెన్ ధరలు పెరగచ్చు అంటున్నారు. అంటే ఎండలకు కోళ్లు చనిపోతూ ఉంటాయి. అలా కోళ్లు చనిపోవడం స్టార్ట్ అయితే చికెన్ ధరలు అమాంతం పెరిగిపోతాయి. మళ్లీ రూ.300 దాటినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

మరోవైపు కోడిగుడ్డు ధరలు కూడా కొండ దిగి వచ్చాయి. నిన్నా మొన్నటి వరకు ఒక్కో గుడ్డు ధర రిటైల్ లో రూ.7 వరకు పలికింది. రోజుకో గుడ్డు తినండి అని వైద్యులు చెప్పినా ఇంటిల్లిపాది గుడ్డు కొనుక్కుని తింటే ధరలకు గుండెపోటు వచ్చే పరిస్థితి ఏర్పడింది. దాని నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉపశమనం లభించింది. ప్రస్తుతం ఒక్కో గుడ్డు ధర రిటైల్ లో రూ.6 నుంచి రూ.6.50 పలుకుతోంది. హోల్ సేల్ లో అయితే ఒక్కో గుడ్డు ధర రూ.5.50 నుంచి 6 రూపాయలు పలుకుతోంది. ఈ ధరలు చూశాక ప్రజలకు కాస్త మనసు శాంతించింది. తిరిగి పోషకాహారం తీసుకోవడం పెంచేశారు. మరి.. తెలుగు రాష్ట్రాల్లో చికెన్, గుడ్డు ధరలు తగ్గడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి