iDreamPost

TilluSquare: మీడియా వల్ల హర్ట్ అయిన అనుపమ పరమేశ్వరన్

  • Published Mar 28, 2024 | 8:38 AMUpdated Mar 28, 2024 | 8:38 AM

హిలేరియస్ ఎంటర్టైనర్ టిల్లు స్క్వేర్ సినిమా మరో రోజులో థియేటర్లలో విడుదలవుతుంది.నిజానికి టిల్లు స్క్వేర్ సినిమా ట్రెయిలర్ వచ్చినప్పుడు అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ షో చూసి అభిమానులతో పాటు మీడియా కూడా షాక్ అయింది.

హిలేరియస్ ఎంటర్టైనర్ టిల్లు స్క్వేర్ సినిమా మరో రోజులో థియేటర్లలో విడుదలవుతుంది.నిజానికి టిల్లు స్క్వేర్ సినిమా ట్రెయిలర్ వచ్చినప్పుడు అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ షో చూసి అభిమానులతో పాటు మీడియా కూడా షాక్ అయింది.

  • Published Mar 28, 2024 | 8:38 AMUpdated Mar 28, 2024 | 8:38 AM
TilluSquare: మీడియా వల్ల హర్ట్ అయిన అనుపమ పరమేశ్వరన్

హిలేరియస్ ఎంటర్టైనర్ టిల్లు స్క్వేర్ సినిమా మరో రోజులో థియేటర్లలో విడుదలవుతుంది. కాగా నిన్న రాత్రి చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరుపుకుంది. హీరో సిద్ధు జొన్నలగడ్డతో పాటు మరికొందరు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ కు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఎక్కడా కనిపించలేదు. దీంతో హీరోయిన్ ఎందుకు రాలేదనే ప్రశ్న అందరిలోనూ ఉండింది. అయితే దాని వెనుక ఉన్న అసలు కారణాన్ని సిద్ధూ వెల్లడించారు.

దీని పై మాట్లాడాలా వద్దా అనే సందిగ్ధత వ్యక్తం చేస్తూ సిద్ధు జొన్నలగడ్డ చివరికి ఓపెన్ అయ్యారు. తాజాగా టిల్లు స్క్వేర్ పోస్టర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన అనవసర వ్యాఖ్యల వల్ల అనుపమ బాధ పడ్డారని హీరో సిద్ధూ అన్నారు. ఆమె చేయి ఎక్కడుందో చూపిస్తూ సోషల్ మీడియాలో చాలా అసభ్యకరమైన పోస్ట్ లు చేశారని, అవి అనుపమని ఎంతగానో బాధ పెట్టాయని సిద్ధూ తెలిపారు. సినీ పరిశ్రమలో మహిళల గురించి వ్యాఖ్యానించేటప్పుడు దయచేసి గీత దాటవద్దని సిద్ధూ మీడియా వారిని అభ్యర్థించారు. అనవసరమైన వ్యాఖ్యల వల్ల అనుపమ మానసిక స్థితి బాగాలేని కారణంగా ఈవెంట్ నుండి తనను దూరంగా ఉండమని తానే కోరినట్లు సిద్ధూ అంగీకరించారు. అయితే సినిమా విడుదలయ్యాక జరిగే ఈవెంట్లకు మాత్రం ఆమెను ఖచ్చితంగా తీసుకువస్తానని వాగ్దానం చేశారు.

Tillu square

కాగా సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ చేయడం అంత సులువు కాదని, అందరూ అనుకున్నంత కంఫర్టబుల్ గా ఆ సన్నివేశాల్లో నటించలేమని అనుపమ గతంలోనే వెల్లడించారు. నిజానికి టిల్లు స్క్వేర్ సినిమా ట్రెయిలర్ వచ్చినప్పుడు అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ షో చూసి అభిమానులతో పాటు మీడియా కూడా షాక్ అయింది. అయితే కామెంట్స్ మరీ మితిమీరడంతో పరిస్తితి కాస్త గంభీరంగా మారింది. సినిమా విడుదలకు ముందు సిద్ధూ, అనుపమ ముద్దు పెట్టుకుంటున్న మరో పోస్టర్ ను నిర్మాతలు విడుదల చేశారు. అయితే ఆ పోస్టర్‌ పై సోషల్ మీడియాలో వచ్చిన అసభ్యకరమైన కామెంట్స్ అనుపమను చికాకు పెట్టాయి. మరి విడుదల తర్వాత ఆమె టిల్లు స్క్వేర్ ఈవెంట్‌లకు వస్తారో లేదో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి